ప్రతిపక్ష హోదా ఇస్తామంటే, ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనే షరతు కూడా జగన్ పెడతాడేమో ? అంతో చురకలు అంటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, స్థానిక సంస్థలు లేదా ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పోటీ చేసి విజయమా సాధించాలని పేర్కొన్నారు యనమల. మండలిలో వైసీపీకు ఉన్న బలం ఆధారంగా జగన్ ప్రతిపక్ష నేత హోదా సాధించుకోవచ్చు చురకలు అంటించారు.
శ్వేత పత్రాల్లోని అంశాలపై మేం ప్రతిపక్షంలో ఉండగానే చెప్తూ వచ్చామని... మా ఆరోపణలపై ఆనాడు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ ఎందుకు ప్రెస్మీట్లు పెట్టలేదు..? అంటూ నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయoతో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారన్నారు యనమల. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని మండిపడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆదాయం లేదనే వాస్తవాల శ్వేతపత్రం ముఖ్యమంత్రి ప్రజలు ముందు పెట్టడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
శ్వేతపత్రం పై అభ్యంతరాలుంటే అసెంబ్లీకి రాకుండా జగన్ ఢిల్లీ పోవటం, మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన విజయవాడ రాకుండా హైదరాబాద్ పోయి మాట్లాడటం వారిలో భయాందోళనకు నిదర్శనం అంటూ ఆగ్రహించారు. జగన్ అప్పులు గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారు.శ్వేతపత్రంలో అప్పులు అవాస్తమంటున్న జగన్.. తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లల్లో వచ్చిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది..?అని ప్రశ్నించారు.