ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రస్తుతం తాను చేసిన హామీలకు సంబంధించి యూటర్న్ తీసుకునే దిశలో ఉన్నట్లు తెలుస్తుంది.చంద్రబాబు ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేశారు.ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆవేదన కలుగుతోందని వాపోయారు.ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయలేమని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చాం. ఇప్పుడు చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రజానీకం కూడా సీరియస్ గా ఆలోచించాలి. లేదంటే ఈ సమస్య ఇలాగే ఉండిపోతోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలి' అని పేర్కొన్నారు. 

సూపర్ సిక్స్ పథకంలో 19 నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రూ. 1,500 నెలవారీ పెన్షన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ. 3,000 నెలవారీ నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. సూపర్ సిక్స్ కింద ఉన్న ఇతర పథకాలలో ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ. 15,000, ప్రతి రైతుకు రూ. 20,000 వార్షిక ఆర్థిక సహాయం ఉన్నాయి. విటన్నింటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి నిలదీశారు.ఏపీ బడ్జెట్ ఎంత లెక్కలు కట్టినా మూడు లక్షల కోట్లు దాటే పరిస్థితి లేదు. కానీ సూపర్ సిక్స్ పేరు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమయ్యే పరిస్థితి ఉండటంతో చంద్రబాబు పక్కకు తప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి నెలకొంది.

సూపర్-6 పథకాలు అమలు చేయలేమని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన చంద్రబాబు అప్పులను సాకుగా చూపిస్తూ తప్పించుకునే ఎత్తుగడ 2019లో వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే. అయినప్పటికీ.. కారణాలు వెతుక్కోకుండా ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేశారు. అనుభవంతో సంపద సృష్టిస్తానంటూ గప్పాలు కొట్టిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్ ముందు రాష్ట్ర ప్రజలని లక్షాది కారులని చేస్తాం అన్ని చేపి ఇప్పుడు ఎమో యుటర్న్ తిసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: