రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు వ్యాపారంలో రాణిస్తూనే మరోవైపు భర్తకు అండగా నిలుస్తూ కుటుంబ బాధ్యతలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నారా బ్రాహ్మణి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ఏడాది మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ప్రచారం చేసి తన ప్రచారంతో ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.
 
బ్రాహ్మణి కోడలు కావడం బాబు అదృష్టమేనని బ్రాహ్మణి నారా ఫ్యామిలీ కీర్తిప్రతిష్టలు పెంచిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవువుతున్నాయి. బ్రాహ్మణి ఇంగ్లీష్ భాషలోనైనా తెలుగు భాషలోనైనా అనర్ఘళంగా మాట్లాడగలరనే సంగతి తెలిసిందే. బ్రాహ్మణి ప్రతిభకు ఎన్నో ప్రశంసలు సైతం దక్కాయి. నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
 
ఆమె బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి 2013 సంవత్సరంలో ఆమె మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేశారు. వెర్టెక్స్ వెంచర్ మేనేజ్‌మెంట్ లో నారా బ్రాహ్మణి ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ గా పని చేశారు. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ కు సంబంధించిన ప్రముఖ సంస్థలకు ఆమె డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
 
నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే రాజకీయాల్లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పొలిటికల్ ఎంట్రీ విషయంలో బ్రాహ్మణి మనస్సులో ఏముందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. నారా బ్రాహ్మణి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నారా బ్రాహ్మణి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: