రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పాలు రాష్ట్రాలు సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలే ఈ భేటీ ప్రధాన అజెండా.


అయితే కేంద్రంలో తమపై వివక్ష చూపాయని పలువురు సీఎంలు దీనిని బాయ్ కాట్ చేశారు. కాగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ భేటీకి హాజరు అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె సడెన్ గా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్ కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా.. తన మైక్ ను మ్యూట్ చేసినట్లు ఆమె ఆరోపించారు.


నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని మమత డిమాండ్ చేశారు. చంద్రబాబుకి సమావేశంలో 20 నిమిషాలు సమయం ఇచ్చారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైంది నేను ఒక్కరినే. అయినా కూడా నాకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. నన్ను మాట్లాడనివ్వకపోవడం అవమానకరం అని అన్నారు. ఇది ఏకంగా బెంగాల్ ప్రజల గొంతు నొక్కడమేనని అన్నారు.


అయితేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. మైక్ కట్ చేశారని మమత చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పు పట్టింది. సమావేశంలో మాట్లాడేందుకు ఆమెకు ఇచ్చిన సమయం పూర్తి అయినందున గడియారం తెలియజేసిందని.. కనీసం బెల్ కూడా మోగించలేదని కేంద్రం తెలిపింది. వాస్తవానికి అక్షర మాల క్రమంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే దీనిపై పలువురు రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ను ప్రత్యేక దేశంగా పరిగణించాలని ఆమె చూస్తున్నారని ఆరోపించారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న బంగ్లాదేశ్ శరణార్థులు, ముస్లింల కోసమే ఆమె పనిచేస్తారని.. అందుకే భారతీయ అభివృద్ధి గురించి జరిగే చర్చలో ఆమె పాల్గొనరని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: