* రాజకీయంగా ఓనమాలు నేర్పిన గురువుకే పోటీగా నిలిచిన రజిని

* ఎమ్మెల్యే గా గెలుపొందిన  మొదటి సారికే  దక్కిన మంత్రి పదవి

*  స్థానిక నాయకులతో వివాదాలే రజని పొలిటికల్ కెరీర్ ను డామేజ్ చేశాయా..?


విడదల రజిని ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది రజిని.అంతకు ముందు ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం లేదు.పొలిటికల్ బాక్గ్రౌండ్ కూడా అస్సలు లేదు కానీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు.ఆమె పొలిటికల్ ఎంట్రీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది.1990 జూన్ 24 న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో రజిని జన్మించారు.ఆమె బాల్యం అంతా అక్కడే గడిచింది.ఆ తరువాత సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది .అనంతరం కర్ణాటకలోని చిత్ర దుర్గంలోని జెఎంఐ ఇంజనీరింగ్ కాలేజీలో  బిఈ పట్టా పొందిన ఆమె ఆ తరువాత ఎంబిఏ చేసారు.చిన్నప్పటి నుండి చదువులో
ముందుండే ఆమె చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసారు.ఈ సమయంలో ఆమెకు  విడదల కుమారస్వామితో వివాహం జరిగింది.వీరిద్దరి జంటకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.వీరు అమెరికా లో స్థిర పడ్డారు.అక్కడే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు.ఆర్ధికముగా బాగా స్థిర పడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజా సేవ చేయాలనీ భావించారు.ఆమె నిర్ణయాన్ని భర్త కుమారస్వామి సపోర్ట్ చేసారు.


2014 సమయంలో చాలా మంది ఎన్ఆర్ఐ లు టీడీపీకి సపోర్ట్ గా నిలవడంతో రజిని కూడా టీడీపీకి సపోర్ట్ చేసింది.విడుదల రజిని ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ తరుణంలో ఆమె విఆర్ ఫౌండేషన్ ప్రారంభించి పేద వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది.నిత్యం ప్రజలతో మమేకం అయ్యారు.అయితే రజిని మామగారు విడదల లక్ష్మీనారాయణ పాపులారీతో ఆమె రాజకీయంగా మరింతగా  ఎదిగారు.చిలకలూరిపేటలోని పురుషోత్తమ పట్టణం విడదల  లక్ష్మీనారాయణ గారి స్వస్థలం.గతంలో ఆయన ఇండిపెండెంట్  కౌన్సిలర్ గా గెలిచి టీడీపీ లో చేరారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా పని చేసారు.ఆమె టాలెంట్ గుర్తించిన పుల్లారావు 2017 లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబుకు పరిచయం చేసారు. మొదటి సారి  మహానాడు సభలో రజిని చేసిన ఒక్క ప్రసంగం చంద్రబాబుతో సహా తెలుగు ప్రజానీకం అందరి దృష్టిలో పడేలా చేసింది.హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మీరు నాటిన ఒక మొక్కను అంటూ ఆమె స్పీచ్ అదరగొట్టింది.ఇలా ప్రజలలో ఎంతో పాపులారిటీ సంపాదించిన రజని తనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరింది.కానీ టీడీపీ నేత చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు.పుల్లారావును కాదని తనకి సీటు ఇవ్వలేనని చెప్పారు..దీనితో ఆమె వైసీపీ గూటికి చేరారు.


రజిని ఫాలోయింగ్ చూసిన జగన్ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ ను కాదని రజనికి టికెట్  కేటాయించారు.మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే టికెట్ పొందిన రజిని విస్తృతంగా ప్రచారం చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.అంతే కాకుండా ఎమ్మెల్యే అయిన మొదటి సారికే మంత్రి పదవి అందుకుంది.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మాత్యులుగా ఆమె పని చేసారు.ఇలా ఆమె రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు కొనసాగింది.అయితే సామజిక సమీకరణాల దృష్ట్యా రజిని ఈ సారి ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.రాష్ట్రంలో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో రజిని ఈ సారి గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: