రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ఇక పొలిటికల్ లీడర్ల కోడలు కూడా సూపర్ సక్సెస్ అయిన దాఖలాలు అనేకం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక అలా సక్సెస్ అయిన వారిలో ఉపాసన ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవి కోడలు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి 2009వ సంవత్సరం ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు.

పార్టీ స్థాపించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగానే ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే తెలుగు దేశం పార్టీకి కూడా అద్భుతమైన గ్రిప్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అలా రెండు సమవుజ్జీలు అయిన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో పోటీపడుతున్న సమయంలో చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించాడు.

మొదటి ఎన్నికల్లోనే ప్రజారాజ్యం పార్టీకి 18 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. కాకపోతే కొంత కాలం పాటు పోరాడిన చిరంజీవి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఇక ఆయన ఆ తర్వాత కొంత కాలం పొలిటికల్ లో యాక్టివ్ గానే ఉన్న ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చేసాడు.

ఇకపోతే ఈయన పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టిన తర్వాత తన కుమారుడు అయినటువంటి చరణ్ కు ఉపాసన ను ఇచ్చి వివాహం చేశాడు. ఉపాసన కామినేని కేవలం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య , మెగాస్టార్ చిరంజీవి కోడలు మాత్రమే కాదు. ఎన్నో వేల కోట్ల రూపాయల విలువైన భారీ వ్యాపార సామ్రాజ్యానికి ఆమె వారసురాలు.

ఆమె వంశం ఆమెను చెన్నైలోని హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డితో కలుపుతుంది.  ఆమె తల్లి , శోభనా కామినేని, సమ్మేళనానికి నాయకత్వం వహిస్తున్నారు. ఉపాసన వివిధ సంస్థలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చరణ్ తో వివాహానికి ముందు నుండే అనేక వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ఉపాసన వివాహం తర్వాత కూడా అదే స్థాయిలో వ్యాపారాలను ముందుకు సాగిస్తూ అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తన మామయ్య చిరంజీవికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో వ్యాపారాలలో గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె ద్వారా చరణ్ కు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: