ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని తెలుగుదేశం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. ఏపీ బడ్జెట్ లెక్కలు తెలియకుండానే... సూపర్ సిక్స్ అంటూ... చంద్రబాబు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు. మొన్న అసెంబ్లీ సమావేశాలలో పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టకుండా.... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి.... చేతులు దులుపుకున్నారు.


అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పాలనలో... ఏపీ అప్పు 14 లక్షల కోట్లకు చేరిందని... చంద్రబాబు ప్రకటించారు.  కానీ అసెంబ్లీ సమావేశాలలో.... అప్పు ఏడు లక్షల కోట్లు అని తేలింది. దీంతో వైసిపి పార్టీ... చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగింది. చంద్రబాబు నాయుడు తప్పులు ప్రచారం చేయడంపై.. బుగ్గన రాజేంద్రనగర్ రెడ్డి  కౌంటర్ ఇచ్చారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పైన చంద్రబాబు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారని.... ఆర్థికంగా ఉన్న లోపాలు ఇవి.. మేము వీటిని సరిదిద్దుతాం అని ఉండేలా వైట్ పేపర్ ఉండాలని తెలిపారు.  


గతంలో పర్ క్యాప్టా 18వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 7 వ స్థానంలో ఉందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని... లిక్కర్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. మీరు గతంలో సిండికేట్ చేసుకుని ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మేవారని ఫైర్‌ అయ్యారు. సిండికేట్ కు ఎక్కువగా అమ్ముతున్న దాన్ని మేము ప్రభుత్వానికి మళ్లించామని... మా ప్రభుత్వం వచ్చాక ARET అనేది పెట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కు ఫండ్ అందించామన్నారు.


వాటిని నాలుగు పథకాల అమలుకు వినియోగించామని...మేము చేస్తే అప్పు.. తెలుగుదేశం చేస్తే నిప్పు అంటూ ఆగ్రహించారు. జూన్ నుంచి మీరు ఎన్ని అప్పులు తీసుకున్నారో కూడా చెప్పండి..తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులను రాయండని తెలిపారు. అప్పులు ఇష్టానుసారంగా తేవడానికి వీలు ఉండదు.. ఒక నిబంధన అనేది ఉంటుందని తెలిపారు బుగ్గన.

మరింత సమాచారం తెలుసుకోండి: