- రాజకీయ ఓనమాలు నేర్పిన పుట్టినిల్లు.!
- మామ సత్యారెడ్డి బాటలో రాజకీయాల్లోకి.!
- గద్వాల కోట కోడలిగా గుర్తింపు.!


డీకే అరుణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. మహిళా రాజకీయ నాయకురాలిగా ఆకాశానికి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే అద్భుతమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లి జాతీయ స్థాయి లీడర్ గా ఎదిగిన డీకే అరుణ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ధర్మవరపు కొట్టం అరుణ అలియాస్ డీకే అరుణ. ఈమె పూర్తి పేరు అరుంధతి. ఈమె 1960 మే 4న మహబూబ్ నగర్ జిల్లాలోని ధన్వాడ గ్రామంలో జన్మించారు. తండ్రి చిట్టెం నరసింహారెడ్డి మక్తల్ శాసన సభ్యులుగా ఉన్న సమయంలో నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తన సోదరుడు మక్తల్ రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గద్వాల రాజకీయ నాయకుడిగా పేరుపొందినటువంటి భరతసింహారెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటికే భరత సింహారెడ్డి తండ్రి సత్య రెడ్డి గతంలో గద్వాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మంచి పేరు పొందారు. అలా మామ భర్త రాజకీయ వారసత్వాన్ని అందిపించుకొని గద్వాల్ లోనే పేరొందిన రాజకీయ నాయకురాలిగా పేరుపొందింది.

 రాజకీయ జీవితం:
 డీకే అరుణ మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గం పంతం మండలంలో జడ్పిటిసిగా పోటీ చేసి  ఘన విజయాన్ని అందుకున్నారు. 1996లో టిడిపి నుంచి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి  1999లో గద్వాల శాసనసభ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ గట్టు భీమిడి చేతిలో మరోసారి ఓడిపోయారు. కానీ 2004లో కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతో ఎదురు చూసిన టికెట్ ఇవ్వలేదు.


దీంతో సమాజ్వాది పార్టీ నుంచి టికెట్ తీసుకొని అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలా గద్వాల నుంచి మరోసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఇదే సమయంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆమెకు మంత్రి పదవి వచ్చింది. 2014లో టిఆర్ఎస్ హవాలో కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గద్వాల కోటపై జేజమ్మ జెండా ఎగరవేసింది. ఇక 2024 ఎలక్షన్స్ లో మహబూబ్ నగర్  ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పై 4,500 ఓట్లతో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: