ఎవరికైనా ఓ దెబ్బ పడితే కానీ  అసలు విషయం అర్థం కాదు అనే సామెత ఊరికే రాలేదు.  జగన్ విషయంలో కూడా అదే జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు నేనే టైగర్ అంటే సరిపోదు. టైగర్ ని  ప్రజలు పిల్లిని కూడా చేసేస్తారు. అలా జగన్ టైగర్ ల ఫీల్ అయిపోయి గెలుస్తాను అనే ఫీలింగ్ పీక్స్ లోకి వెళ్లిపోయి చివరికి ఓడిపోయారు. ఓడితే కానీ ఆయనకు అసలు విషయం కనబడలేదు. నిజం చెప్పాలంటే జగన్ కు ఈ ఓటమి ఒక పెద్ద గుణపాఠం అని చెప్పుకోవచ్చు. గుణపాఠం నుంచి ఆయన పెద్ద పాఠం నేర్చుకోగలుగుతారు. ఇప్పటి నుంచి చంద్రబాబును ఎలా దెబ్బ కొట్టాలో అవగాహన చేసుకోగలుగుతారు. 

ఆ విధంగానే జగన్ సాంకేతాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన జగన్ కి 8 పార్టీల మద్దతు దొరికింది. సమాజ్ వాది, తృణమూల్ కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ,ఏఐడీఎంకే  వంటి పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ ఆయనకు కాంగ్రెస్ మద్దతు తెలుపలేదు. దీన్నిబట్టి చూస్తే  తెలుగుదేశం కాంగ్రెస్ ఒక్కటే అని, ఇక తెలుగుదేశం బిజెపి కూటమిలో ఉంటుంది మరియు కాంగ్రెస్ తో కలిసి పోతుందని జగన్ చెప్పకనే చెప్పేసారు. కట్ చేస్తే..కలిసొచ్చే వాళ్లతో కలిసి పోరాటం అని జగన్ ఒక సాంకేతాన్ని ఇస్తారు. ఇందులో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలన్నీ నాతో వస్తే  కలిసి పోరాటం చేద్దాం  అనే సంకేతం అందించారు. 

దీన్ని బట్టి చూస్తే మాత్రం రాబోవు భవిష్యత్తులో జగన్ కూడా ఇతర పార్టీలతో కూటమి కట్టడానికి రెడీ అయిపోయారని అర్థమవుతోంది. ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి  ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టుకొని రాబోవు ఎన్నికల వరకు సన్నద్ధం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నిజంగా జగన్ అనుకున్నది సక్సెస్ అయితే మాత్రం రాబోవు ఎన్నికల్లో చంద్రబాబుకు తప్పక చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: