ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ దాదాపుగా బెంగుళూరులో ఉన్న ఎహలెంక పేలస్ కే పరిమితం అయ్యారు. అయితే రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ బూజు దులుపుకొని మరలా ఏపీలో అడుగు పెట్టాడు. అయితే ఇకనుండి జగన్ తన పార్టీకి అందుబాటులోనే ఉంటాడనే మాటలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ముహూర్తాలను చూసుకుంటూ అడుగులు వేస్తారని టాక్ వినబడుతోంది. అదేంటి జగన్ అలాంటివాటిని నమ్ముతాడా? అనే అనుమాలు రావచ్చు.. కానీ మీరు విన్నది నిజమే. రానున్న శ్రావణ మాసంలో సంచలన నిర్ణయాలు వైసీపీ నుంచి ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే జూలై నెలలో నిర్వహించాలని అనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ తాజాగా పులివెందుల, బెంగళూరు పర్యటనలకు వెళ్ళిపోయినట్టు సమాచారం. అయితే ఆషాడ మాసం కావడంతోనే ప్రజాదర్బార్ ని జగన్ ప్రారంభించలేదని కూడా అంటున్నారు. ఆగస్టు 5 నుంచి శ్రావణమాసం మొదలవుతోంది. దాంతో జగన్ ప్రజా దర్బార్ ని ఆగస్టు నెల మొదటి వారంలో నిర్వహించడానికి మంచి ముహూర్తం నిర్ణయించారు అని గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ప్రజాదర్బార్ ని తాడేపల్లిలోని తన పార్టీ ఆఫీసులో నిర్వహిస్తారని వినికిడి. ఈ వేదికగా ప్రజల సమస్యలను నేరుగా విని తాజా కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేయనున్నారని అంటున్నారు. ఆ విధంగా ప్రజలకు జగన్ మరలా చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మరో వైపు పార్టీ నేతలకు, క్యాడర్ కి కూడా జగన్ ఇకనుండి సమయం కేటాయిస్తారు అని వినికిడి. ఈ క్రమంలో ఎవరైనా నేరుగా కలిసే వెసులుబాటుని కూడా జగన్ కల్పిస్తున్నారు అని టాక్ వినబడుతోంది. ఇలా పార్టీని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడుతూనే ఆగస్టు 15 వరువాత జగన్ జిల్లా పర్యటనలకు కూడా రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అదేవిధంగా పార్టీలో ఉన్న వారు ఎవరు? పోయేది ఎవరు? అన్నది ఒక అంచనాకు తెచ్చుకుంటూ కొత్త కమిటీలను కూడా జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలోనూ ఏర్పాటు చేస్తారని అది కూడా శ్రావణ మాసంలోనే ఉండవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: