2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇందులో సిక్స్ గ్యారెంటీస్ చాలా కీలక పాత్ర పోషించాయి. ఈ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆగస్టు 15 నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలని దానిపై సమాలోచనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని విధివిధానాలపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఒక రిపోర్టు ప్రిపేర్ కూడా చేశారు. వారి రిపోర్ట్ ప్రకారం, ఈ పథకం అమల్లోకి తెస్తే ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు నష్టం వస్తుంది.

ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూడ్చాల్సి ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఆల్రెడీ తమ మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించేసాయి. ఈ రాష్ట్రాలు ఈ పథకాన్ని విజయవంతంగానే అమలు చేస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాల అమలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ స్టేట్స్ ఏయే బస్సుల్లో ప్రయాణం ఉచితం ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో కూడా స్టడీ చేశారు.

రేపు ఆర్టీసీ, రవాశా శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు ఒక రివ్యూ మీటింగ్ పెట్టమన్నారు. ఇందులో ఫ్రీ బస్సెస్ స్కీమ్‌ గురించి డిస్కస్ చేయనున్నారు. దీని గురించి చర్చ చేయనున్నారు కాబట్టే ముందుగానే అధికారులు ఒక రిపోర్టు తయారు చేసి ఉంచారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏపీ ఆర్టీసీలో డైలీ 36-37 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది ఆడవాళ్లే ఉంటారని అంచనా. ఆ లెక్కన చూసుకుంటే 15 లక్షల మంది మహిళలు డైలీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఫ్రీ స్కీం తీసుకొస్తే ఇంకెక్కువ ముందే ప్రయాణించవచ్చు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు మాట్లాడవచ్చు.

తెలంగాణలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌‌ల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణ సౌకర్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఫ్రీగా ప్రయాణించొచ్చు. కర్ణాటకలోనూ సేమ్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలవుతోంది.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఈ స్కీం అమలు చేయవచ్చు. అలానే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందించొచ్చు. ఛార్జీ టికెట్ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కానీ మిషన్ మాత్రం ఆ చార్జి కి సంబంధించిన డబ్బులను ఫీడ్ చేసుకుని ఒక హిస్టరీ మైంటైన్ చేస్తుంది. వాటన్నిటినీ లెక్కిస్తే ప్రభుత్వం ఆ డబ్బును కడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: