ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సైతం ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అనే అంశం పైన తాజాగా కీలకమైన అప్డేట్ ఇచ్చినట్లుగా ఏపీ సర్కార్ తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను కూడా ఖరారు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఈ పథకం పైన పలు రకాల కసరత్తులు కూడా చేశామని ఏపీ సర్కార్ తెలియజేశారు.. పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ లతోపాటు విజయవాడ సిటీ, విశాఖపట్నం, మెట్రో బస్సులలో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇదంతా ఇలా ఉంటే రేపటి రోజున సీఎం చంద్రబాబు రవాణా ఆర్టీసీ పైన ఒక కీలకమైన సమీక్ష నిర్వహించి తెలుపనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. ఈ సమీక్ష అనంతరం మహిళల ఫ్రీ బస్సు పైన ఒక కీలకమైన అప్డేట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే అమలు చేశారు. ఆయా ప్రభుత్వాలు. అయితే వీటి పైన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినట్లు సమాచారం.  ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు జర్నీ పైన అమలు చేస్తే ప్రతినెలా కూడా ఏపీఎస్ఆర్టీసీ పైన 250 కోట్లు అదనపు భారం పడుతుందట.


సుమారుగా 30 లక్షల మంది ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఇటీవలే అధికారులు గుర్తించారట .ఇందులో 15 లక్షల మంది వరకు మహిళలు ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మరి ఇందుకు  సంబంధించి సోమవారం రోజున అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. మరి ఏ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేస్తారో చూడాలి. ఇప్పటికే పథకాల పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఏపీలో ఖజానా ఖాళీ అయిందని సంపద సృష్టించే మరి పథకాలకు ఖర్చు చేయవలసి ఉంటుందని తెలియజేశారు. మరి ఇలాంటి సమయంలో కూడా ఫ్రీ బస్సు అమలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: