* పడ్డ చోటే తిరిగి నిలబడ్డ లోకేష్.!

* అనుభవాలు నేర్పిన పాఠాలే జీరో టూ హీరో చేసేనా.?

 * లోకేష్ అంటే పప్పు కాదు నిప్పు.!

(అమరావతి- ఇండియాహెరాల్డ్ ) : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్న యువ నాయకుడు,ఏపీ మానవ వనరుల మరియు ఐటీ శాఖమాత్యులు లోకేష్.చంద్రబాబు తన తర్వాత రాజకీయ వారసుడుగా లోకేష్ ను పరిచయం చేసేందుకు 2013 లో రాజకీయాల్లో అరంగేట్రం చేయించారు.అయితే అప్పటికే ఉమ్మడి ఏపీలో తెలంగాణాలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఏపీలో జగన్ వైస్సార్సీపీ పార్టీపెట్టి రాజకీయంగా ప్రజల్లో ఆదరణ ఉంది.అయితే రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఏ మాత్రం రాజకీయాల్లో పనికిరాడు అనే పేరు సంపాదించాడు.నేతలతో వ్యవహిరించిన తీరు,పార్టీ కార్యక్రమాల్లో ప్రజలతో మాట్లాడే విధానం సరిగ్గా ఉండేది కాదు,మాటలు తడబడుతూ ఉండేవి దాంతో రాజకీయ విశ్లేషకులు లోకేష్ రాజకీయాల్లో పనికిరాడు అని తేల్చేసారు.

అయితే 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది.చంద్రబాబు సీఎంగా  జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షనేతగా ఉంటూ లోకేష్ ను తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు .ఆ విమర్శలు బాగా శృతిమించి పప్పు అనే బ్రాండింగ్ చేసేదాకా వెళ్లాయి.వారి విమర్శలకు తగ్గట్టుగానే లోకేష్ ప్రవర్తన కూడా ఉండేది.అలాగే ప్రజలు కూడా లోకేష్ ను కేటీర్ మరియు జగన్ తో అస్తమానం పోలుస్తూ ఉండేవారు.దాంతో సొంత పార్టీ లోకూడా లోకేష్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఐనప్పటికీ లోకేష్ పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం రాజకీయంగా లోకేష్ ను ప్రోత్సహిస్తూనే వచ్చారు.2017 మార్చ్ లో చంద్రబాబు లోకేష్ ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి,ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ఐటీ మంత్రిగా కూడా చేసారు.దాంతో ప్రతిపక్షం అధికారం అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.అయితే వాటిని పట్టించుకోని లోకేష్ తన మంత్రిత్వ శాఖను సమర్ధవంతంగా చేసుకుంటూ పోయారు.దాంట్లో భాగంగానే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తెప్పించడానికి తన వంతు కృషి బాగా చేసారు.అలాగే తన శరీరాకృతిపై వస్తున్నావిమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా సన్నగా మారి చూపించారు.

2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్లరామకృష్ణారెడ్డి చేతిలో అయిదు వేల ఓట్లతో ఓడిపోయారు.దాంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా కొనసాగారు.అయితే టీడీపీ ఓటమి అనేది లోకేష్ పై గట్టిగానే ప్రభావం చూపించింది.ఒకవైపు టీడీపీ పార్టీ ఓటమి మరోవైపు లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు పై చంద్రబాబుకు టెన్షన్ స్టార్ట్ అయింది.అప్పటికే టీడీపీకు కేంద్ర సపోర్ట్ లేదు అలాగే జనసేన తో ఏర్పడిన విబేధాలు కూడా ఎక్కువయ్యాయి.ఆ విధంగా టీడీపీ పార్టీ ఒంటరిగా మిగిలింది.అప్పటినుండి లోకేష్ లో చాల మార్పులు వచ్చాయి.తాను ఓడిపనప్పటికీ మంగళగిరిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారికోసం పోరాడుతూ వచ్చాడు.దాంతో రాజకీయంగా మంచి అనుభవం వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చాడు అప్పుడు ప్రభుత్వం కూడా లోకేష్ ను పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా చూసింది.ప్రజలు కూడా దీన్ని గమనించి రాజకీయనాయకుడిగా అంగీకరించారు.దాంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకుంది.లోకేష్ తాను ఓడిపోయిన చోటు నుండే భారీ మెజారిటీతో గెలిచి తనంటే ఏంటో ప్రజలకు అర్ధం అయ్యేలా చేసాడు.ఎన్నికల ప్రచారంలో రెబ్బుక్ చేతబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆక్రమణలు చేసిన వారి పేరు దాంట్లో చేర్చి ప్రస్తుతం వాళ్ళ భరతం పెట్టె దిశగా ప్రయతనం చేస్తున్నాడు.దాంతో ప్రజలు లోకేష్ పప్పు కాదురా ... నిప్పు అనేలా స్థాయికి ఎదిగాడు అని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: