ఎన్నికల ముందు హడావిడి చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రాజకీయ స్ట్రాటజిస్ట్ గా నీరసంపాదించారు. అయితే తాజాగా ఈయన రాజకీయ పార్టీని రూపొందించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని ఆ పార్టీ పేరు "జన్ రాజ్ అభిమాన్". అక్టోబర్ రెండవ తేదీన అవతరించనుందట. అందుకు  సంబంధించిన అన్ని సన్నహాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 8 రాష్ట్ర స్థాయి సమావేశాలను సైతం జెన్ సూరజ్ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే మరికొద్ది వారాలలో ఈ సమావేశాలను కూడా పూర్తి చేసి బీహార్లో రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది సమీకరించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.


కొత్త పార్టీ ఏర్పాటుకు సైతం సంబంధించి ప్రక్రియలను కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జెన్ సురాజ్ సమావేశాలకు సైతం ఏజెండాగా ఉండదని న్యాయకత్వ నిర్మాణం, పార్టీ ప్రాధాన్యత, పార్టీ రాజ్యాంగం  పంటి సమావేశాలలో కూడా చర్చించబోతున్నారట. ఇందుకోసం పాట్నాలో నిన్నటి రోజున జిల్లా గ్రామస్థాయిలలో కూడా ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్తగా పేరుపొందిన పీకే తనదైన ముద్ర వేసుకున్నారు. బీహార్లో మార్పు పేరుతో జన్ సురాజ్ అనే పేరుతో కొద్ది కాలం పాటు క్యాంపియన్ కూడా ప్రారంభించారు.


అలాగే విద్య, ఆరోగ్యం ఉపాధి తదితర అంశాలలో కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. మహాత్మా గాంధీ జయంతిని పూర్తి చేసుకొని అదే రోజున తన రాజకీయ పార్టీని ప్రారంభించారని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపైన వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండడంతో ఆర్జెడీకి తమ సాంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంకుగా మారిందని. వీరు తప్ప మినహా మరింత విస్తరింప చేయలేకపోయారని దీంతో తమ కొత్త పార్టీకి కలిసొచ్చే అవకాశాలు చాలానే ఉన్నట్లు జెన్ సురాజ్  పార్టీ భావిస్తోందట. మరి వీటి పైన పీకే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: