* హీరోగా పవన్ కు తిరుగులేని స్టార్ డం.. ఆ క్రెజే పవన్ కు బలంగా మారిందా..!!

* పదేళ్ల కష్టం.. అలుపెరుగని పోరాటం.. సేనాని సక్సెస్ కి కొలమానము..

* రాజకీయంగా ఎన్నో అవమానాలు, విమర్శలు.. పవన్ గెలుపును ఆపలేకపోయాయిగా..!!



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక సంచలనం.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ సాధించారు.సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ పోయారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ క్రేజ్ మెగాస్టార్ ని  క్రేజ్ ను సైతం క్రాస్ చేసింది. అంతటి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. పదేళ్ల పాటు సూపర్ హిట్ లేని పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ సినిమా వస్తుందంటే యూత్ ఆడియన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవికి పవన్ కళ్యాణ్ తోడుగా నిలిచారు. ప్రజారాజ్యం యువ నేతగా పవన్ విస్తృత ప్రచారం చేసారు. అప్పటికే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జనాదరరణ బాగా ఉండటంతో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. అయితే అదే ఏడాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన నిరసనలు మొదలవటం 2014 లో రాష్ట్రం రెండుగా విభజించబడటం చక చక జరిగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 2011 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో ఏకంగా 19 సీట్లు గెలుచుకున్నారు..ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీ స్థాపించారు.


అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చారు.. పవన్ మద్దతుతో టీడీపీ ఘన విజయం సాధించింది.ఒంటరిగా పార్టీ పెట్టిన పవన్ కు పార్టీ నడిపేంత డబ్బులు లేకపోవడంతో తాను సినిమాలలో నటిస్తు అలా వచ్చిన డబ్బుతో పార్టీ కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు. అయితే 2014 నుంచి 2019 వరకు పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడంలో విఫలం అయ్యారు. 2019 లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన చిత్తుగా ఓడింది. పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయారు. ఆ ఎన్నికలలో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ పార్టీ పవన్ ను విమర్శించడం మొదలు పెట్టింది. వ్యక్తిగతంగా ఎన్ని దూషనలు చేసిన పవన్ అంతే గంభీరంగా నిలబడ్డారు. గాయ పడ్డ సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అనే మాట పవన్ కు సరిగ్గా సరిపోతుంది.



వైసీపీ పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన పవన్ తన పార్టీని ముందుండి నడిపించారు. ప్రధాన ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో బీజేపీని కూడా భాగస్వామ్యం చేసేందుకు పవన్ ఎంతో కష్ట పడ్డారు.
అనుకున్న విధంగా కూటమి ఫామ్ అయింది. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు మాత్రమే లభించాయి. కానీ అధైర్య పడకుండా అద్భుత వ్యూహంతో పని చేసారు. పవన్ ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసారు.. పవన్ ను ఒడించేందుకు గత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ పవన్ సంచలన విజయాన్ని ఆప లేకపోయారు. పిఠాపురం ఎమ్మెల్యే గా గెలిచి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ భాద్యతలు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: