భార్యా భర్తలు ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ వైవాహిక జీవితంలో ముందుకు సాగాలి. అయితే కలహాలు రాకుండా కాపురం ఉండదు. ప్రస్తుతం విడాకులు అనేవి చాలా ట్రెండ్ అయిపోతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ డివోర్స్ తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. పెళ్లైన రెండు, మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు.

ఇందులో కొందరు రెండో పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు తమ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.  భార్యాభర్తలు మధ్య విభేదాలు వచ్చి విడిపోయినప్పుడు లేదా విడాకులు కేసు కోర్టులో కొనసాగుతున్న సమయంలో ఎటువంటి ఆదాయం లేని భార్య జీవితాన్ని గడపడం కోసం ఇవ్వాల్సిన డబ్బును మెయింట్ నెన్స్ అంటారు. భార్య ఆహారం, వసతి, దుస్తులతో పాటు వారి పిల్లల చదవు, ఇతర బాగోగులు కూడా భర్తే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భార్యకు నెలకు కొంత చొప్పున లేదా ఏక మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇటీవల విడాకులు అనే కాన్సెప్ట్ తీసుకొని దాని ద్వారా వచ్చే భరణాన్ని కొంత మంది మహిళలు వ్యాపారంగా మలచుకుంటున్నారు. ఇలా చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు చర్చకు దారి తీసింది. ఓ కేసులో ఓ మహిళకు రూ.రెండు కోట్ల భరణం చెల్లించాలని సర్వోన్నత న్యాయ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఆ మహిళకు ఇది రెండో పెళ్లి. మొదటి భర్తతో ఏడాది పాటు కలిసి ఉండి అతనిపై కేసు వేసి విడాకులకు అప్లై చేసి రూ.40లక్షలను పరిహారంగా తీసుకుంది. ఇప్పుడు రెండో భర్తతో తొమ్మిదేళ్లు కాపురం చేసి మళ్లీ విడాకులు కావాలని కోరింది. దీంతో కోర్టు ఆమెకు రూ.రెండు కోట్లు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది.  మొత్తంగా చూసుకుంటే ఈ పదేళ్లలో ఆమె సంపాదన రూ.లక్షన్నర స్థితికి వచ్చిందని భర్త తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈమె ఈ పనే చేస్తుంది కేసు కొట్టేయాలని కోరినా.. కోర్టు ఈయన వాదనను తోసిపుచ్చింది. భరణం చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: