•అనంతపురం రూపురేఖలను మార్చిన అనంత వెంకటరామిరెడ్డి.

•ఒకప్పుడు హీరో కానీ ఇప్పుడు జీరో

•అనంత వెంకట రామి రెడ్డి మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందుతారా..



(అనంతపురం - ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

అనంత వెంకటరామిరెడ్డి.. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 11వ , 12వ, 13వ లోక్సభలకు ఎన్నికయి సత్తా చాటారు. 1987 -96 మధ్యకాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈయన 1996లో 11వ లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలాగే 1998 లో కూడా ఎన్నికయ్యారు.  అంతేకాదు 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో తిరిగి పోటీ చేసి మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ అందుకున్నారు. ఇక 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాలుగోసారి కూడా 15వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు అనంత వెంకటరామిరెడ్డి.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అనంతపురం రూపు రేకల్ని మార్చేసారని చెప్పవచ్చు. ఒకప్పుడు అనంతపురం అంటే కేవలం క్లాక్ టవర్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అనంతపూర్ ను చూస్తే మాత్రం ఒక సిటీని తలపిస్తోందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద భవనాలు, అద్భుతమైన రోడ్డు మార్గాలు, వినోదాత్మక కేంద్రాలతో పాటు పిల్లల కోసం, పెద్దల కోసం పార్కులను కూడా ఏర్పాటు చేసి అనంతపురం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అనంతపురం మున్సిపాలిటీ ఎంత శుభ్రతను పాటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ప్రజలకు కావలసిన కూరగాయల మార్కెట్ మొదలుకొని పూల మార్కెట్ వరకు అన్నీ కూడా అనంతపురంలోనే లభ్యమవుతాయి. పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన దుస్తులు , పాదరక్షలు ఇలా ఒక్కటేమిటి ఏం కావాలన్నా సరే అన్నిటికీ అనంతపూర్ కొలువు అని చెప్పవచ్చు. అద్భుతమైన శిల్పారామ కలలకు అనంతపూర్ పుట్టినిల్లుగా మారింది. ఎన్నో సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన అనంతపూర్ ను సిటీగా మార్చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత అనంత వెంకటరామిరెడ్డికి సొంతమవుతుందని చెప్పవచ్చు.

 వైయస్సార్ మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి వచ్చిన అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నియోజకవర్గం నుండి 1989 మొదలుకొని 1999 వరకు ఏకంగా నాలుగుసార్లు ఎన్నికలు జరగగా నాలుగుసార్లు కూడా ఈయన విజయాన్ని సాధించి హీరో అనిపించుకున్నారు. అలాగే 2004 మొదలుకొని 2014 ఎన్నికల వరకు కూడా అనంత వెంకట్రాంరెడ్డి సత్తా చాటారు. అలా ఏకంగా ఆరుసార్లు గెలిచిన  పనిచేసిన ఈయన..  గత 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా నిలిచి సత్తా చాటారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి అనంతపూర్ నగరాన్ని భారీగా తీర్చిదిద్దారు. కానీ ఈసారి ఎన్నికలలో మాత్రం ఓడిపోయి జీరోగా నిలిచారు అనంత వెంకట్రామిరెడ్డి .

మరింత సమాచారం తెలుసుకోండి: