హెచ్ఆర్ఏ అంటే ఇంటి మధ్య భత్యం 24% కొనసాగింపు పైన సచివాలయ ఉద్యోగుల సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడుని కలిసి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత 12వ పిఆర్సి కమిషన్ నియమించాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో ఈ సమావేశాలలో రికార్డులు ఇతర అంశాల పైన కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
గత పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీసర్వేను సైతం నిలిపివేయాలని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలు ప్రకటనలు ఆదేశించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పైన ఏపీ ఉద్యోగుల సైతం ఏపీ సీఎం పైన హర్షం వ్యక్తం తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పింఛనీ పెంపు వ్యవహారం పైన పెంచి మరి గుడ్ న్యూస్ తెలియజేశారు. అలాగే స్టోర్లలో కూడా కంది బ్యాళ్లు ,గోధుమ పిండిని కూడా చౌక ధరకే పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేశారు చంద్రబాబు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చే నెల 15 నుంచి అమలు చేస్తామని.. అలాగే అమ్మ ఒడిని కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలుపుతున్నారు. మరి ఏది ఏమైనా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేస్తారో లేదో చూడాలి.