గత కొన్నేళ్లుగా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని రకాల కేసుల ఆరోపణలతో జైలు శిక్షణ కూడా అనుభవించారు. అయితే ఈ కేసుల పైన ఇప్పుడు తాజాగా బిజెపి మంత్రి సత్య కుమార్ యాదవ్ పలు విషయాలను తెలియజేశారు. ఆర్థిక మీరారోపణలు కలిగి ఉన్న నిందితుడిగా ఉన్న జగన్ జైలుకు వెళ్లకుండా ఎటువంటి శక్తి ఆపలేదు అంటూ వెల్లడించారు బిజెపి మంత్రి  సత్యకుమార్.. సంపదే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది అంటూ కూడా విమర్శించడం జరిగిందనీ ఇటీవల అనంతపురం బిజెపి జిల్లా కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. అలాగే పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సమావేశానికి గెస్టుగా సత్యకుమార్ హాజరయ్యారు.


ప్రస్తుతం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది అంటూ తెలియజేస్తున్నారు. ఆంధ్రాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు హత్యలు దాడులు జరుగుతున్నాయని గుగోలు పెడుతున్నారు దీనిని ఢిల్లీ వరకు ధర్నా తీసుకువెళ్లి పెద్ద నాటకం ఆడారంటూ తెలియజేశారు మంత్రి సత్య కుమార్. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండేందుకే జగన్ ఇలాంటివి డ్రామాలాడారని కూడా తెలిపారు.


వైసీపీ శ్రేణులపైన జరుగుతున్న ఈ దాడులు వివరాలు ఇవ్వాలి అంటే ఇంతవరకు ఎలాంటి సమాధానాలు లేవని కూడా తెలిపారు.. అలాగే ధర్మవరంలో మాట్లాడుతూ వస్త్రాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్తంగా ధర్మవరం చేనేత పరిశ్రమ మంచి పేరు సంపాదించింది కానీ గత వైసిపి ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ తెలిపారు. చేనేతలకు రాయితీలను తొలగించారని దీంతో చేనేతలు అప్పుల పాలయ్యారని కూడా తెలిపారు. దీంతో వైసిపి ప్రభుత్వం విఫలమయ్యిందని కూడా తెలియజేశారు.ఇలాంటి దురదృష్ట పరిస్థితులను మార్చి చేనేతరంగం మళ్ళీ కళకళలాడాలని అందుకు తగ్గట్టుగా సహాయ సహకారాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అందించేలా చూస్తామంటూ కూడా తెలియజేశారు సత్యకుమార్. మరి జగన్ జైలుకు పంపిస్తామని చెబుతున్న మాటకు వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం గతి కౌంటర్ ఇస్తున్నారు. ముందు చెప్పిన హామీలను నెరవేర్చండి అంటూ కూటమినేతలకు కూడా కౌంటర్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: