తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్సభ పరిధిలో ఈ కార్డు పొందడానికి దాదాపుగా 3 లక్షల కుటుంబాలకు సైతం అర్హత ఉన్నదని కేవలం 28,000 మంది మాత్రమే కార్డులు ఇప్పటివరకు ఇచ్చారు అంటు తెలిపారు. ఇలా ఒక గుంటూరులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ప్రజలందరూ ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకోవాలి అంటూ వివరించారు. ప్రతి ఒక్క భారతీయులు కూడా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటూ కేంద్రమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు అంటూ తెలిపారు మంత్రి పెమ్మసాని.
ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఈ కార్డు కూడా వినియోగించుకోవచ్చు అంటూ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి కావలసిన డబ్బులు లేవని కూడా తేల్చి చెప్పడం జరిగింది.. ఈ పథకం కింద ఆసుపత్రులకు బిల్లులు కూడా రావట్లేదు అంటూ తెలియజేశారు. రోగులకు ట్రీట్మెంట్ దీనివల్ల జరగట్లేదని పెమ్మసాని తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇక ఆరోగ్యశ్రీ పథకానికి స్వస్తి పలికినట్టే అన్నట్లుగా పలువురు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా 25 లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజ్ అందించే ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వీటి పైన ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.