• హైలైట్ గా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి పంచులు!
 
• హరీశ్ రావుకి హాఫ్ నాలెడ్జ్, కెసిఆర్కి 'ఫుల్లు' నాలెడ్జ్ అంటూ రేవంత్ చేసిన పంచులు వైరల్!
 
• BRS నేతలు అబద్ధాలు మానకపోతే నిజాలు చెప్పడం ఆపేదే లేదన్న రేవంత్!


హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్: తెలంగాణ వార్షిక బడ్జెట్ పద్దుపై తీవ్రమైన చర్చ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి పంచ్ల వర్షం కురిపించగా అవి సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి.2017 జనవరి 4న అప్పటి సీఎం అయిన కేసీఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్న మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే సభలో అబద్ధాలు చెబుతున్న హరీష్ రావుకు తన వద్ద సమాచారాన్ని పంపుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పినట్లు హరీష్ రావుకు హాఫ్ నాలెడ్జ్ అని.. పెద్దాయనకు 'ఫుల్లు' నాలెడ్జ్ అంటూ చేతితో ఫుల్ బాటిల్ సైగ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చూయిస్తూ వేసిన పంచ్ బాగా పేలింది. సోషల్ మీడియాని షేక్ చేసేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా అప్పుడు సభలో ఒక్కసారిగా నవ్వడం జరిగింది. రేవంత్ వేసిన ఈ పంచ్ తాలూకా క్లిక్  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభలో వాస్తవాలే మాట్లాడాలని హరీష్ రావును కోరారు.అలాగే మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఊడిగం చేసింది మీరే కదా అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన పంచులు బాగా హైలైట్ అయ్యాయి.


ఇంకా BRS నేతల గురించి మాట్లాడుతూ.. వాళ్లు అబద్దాలు మానకపోతే తాను నిజాలు చెప్పడం ఆపేది లేదని మరో సినిమాటిక్ డైలాగ్ తో కూడిన పంచ్ వేశారు. అసెంబ్లీలో విద్యుత్ అంశంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. విద్యుత్ అంశంలో కమిషన్ను రద్దుచేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కానీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం చెప్పిందని అన్నారు. కమిషన్ను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పిందని అన్నారు. చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారనే అభ్యంతరంపై కోర్టు తమను అడిగిందని అన్నారు. చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా? అని సుప్రీంకోర్టు తమను అడిగిందని అన్నారు. చైర్మన్ను మార్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పామని అన్నారు. కమిషన్ను రద్దు చేయాలన్న వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందని అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నప్పటికీ ఏడేళ్ల సమయం పట్టిందని విమర్శించారు.అలాగే యాదాద్రి పవర్ ప్రాజెక్టును ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం అనగా 2021లో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కానీ అది ఇప్పటికీ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికే తాము కమిషన్ను వేశామని అన్నారు. ఇలా కెసిఆర్, హరీశ్ రావు ఇంకా BRS నేతలపై సీఎం రేవంత్ కామెంట్స్ చేస్తూ మధ్యలో వేసిన పంచులు బాగా హైలైట్ అయ్యాయి.. కాంగ్రెస్ పార్టీ నేతలకు, అభిమానులకు మంచి బూస్టింగ్ ని ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: