ప్రముఖ నటుడు, సినీ నిర్మాత, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.గత కొన్నిరోజులుగా జగన్ పై వరుస పోస్ట్ చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సందర్భం లేకపోయినా నాగబాబు వేస్తున్న పోస్ట్ల పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే నాగబాబు మాత్రం తగ్గేది లేదంటున్నారు. మరోసారి జగన్ పై ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో జగన్ కి న్యాయం చేస్తామన్నారాయన.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటననను ప్రస్తావించారు. ఆయనకు న్యాయం చేయాలంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. '2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి.. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి' అన్నారు నాగబాబు.ఎందుకంటే 2019 శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు.

5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోం మంత్రి గారిని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు.జనసేన నాయకుడు నాగబాబు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని నెటిజన్లు అంటున్నారు. ఒక్కోసారి జనసేన నాయకుడు నాగబాబు చేసే పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేసిన సందర్బాల గురించి కొత్తగా చెప్పనవసం లేదు. నాగబాబు కామెంట్లపై వైసీపీ నాయకుల స్పందన కోసం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: