*  కూటమి ప్రభుత్వానికి హామీల తలనొప్పి ఇప్పట్లో తీరేలా లేదుగా..

* హామీల అమలు జాప్యం పై జగన్ సెటైర్లు

* మొదటి విడతకే ముక్కుతున్న కూటమి.. చివరిదాకా నిలబడుతుందా..?



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంచలన విజయం సాధించింది. గత ఎన్నికలలో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈ సారి కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.. అయితే ఎన్నికల ప్రచారంలో భారీగా హామీలిచ్చిన కూటమి ప్రభుత్వానికి పధకాల అమలు తలనొప్పిగా మారింది. అప్పు తెచ్చి డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో పధకాల అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు.


ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకున్న జగన్, కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతటి ఘోర ఓటమి తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రారని కూటమి నేతలు ప్రచారం చేశారు. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక పార్టీ కార్యకర్తల హత్యలపై గళం ఎత్తిన జగన్, ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై ఢిల్లీకి వెళ్లి మరి ధర్నా కూడా చేసారు.అలాగే జాతీయ స్థాయిలో వైసీపీకి మద్దతు కూడగట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఢిల్లీ ధర్నా సక్సెస్ కావడంతో జగన్ ఇంకాస్త దూకుడు పెంచారు. తన పాలనలో జరిగిన సంక్షేమం, అప్పుల గురించి చెబుతూ కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి చంద్రబాబు పచ్చి అబ్బద్దాలు చెబుతున్నారని జగన్ తెలిపారు.2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎందుకు చెప్పడం లేదని చంద్రబాబును జగన్ రివర్స్ లో ప్రశ్నించారు.మరోవైపు తల్లికి వందనం గురించి ప్రస్తావిస్తూ జగన్ మాస్ ట్రోలింగ్ చేసారు.

అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా పెట్టారని, కాని ఆ పేరుతో తల్లుల నెత్తిన శఠగోపం పెట్టారని కూటమి ప్రభుత్వాన్ని జగన్ విమర్శించారు..నీకు పడైదు వేలు, నీకు పడైదు వేలు అంటూ వేళ్ళు చూపిస్తూ ప్రచారం చేసారు.జగన్ లేకపోయే సరికి తల్లులకు ఇవ్వాల్సిన రూ.15000 రూపాయిలు పోయాయని .. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తానని చెప్పడం నిజంగా సిగ్గు చేటని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 43 లక్షల తల్లులకు అమ్మఒడి ఇచ్చామనే విషయన్ని జగన్ గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జగన్ విమర్శించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: