ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వంలో బాగా ఒక వెలుగు వెలిగిన వారిలో వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి. ముఖ్యంగా ఏపీలో వేలాది మంది మహిళలు ఆడపిల్లలు మాయం అవ్వడం వీరి పాత్ర ఉందని కూడా చాలామంది విమర్శలు చేశారు. కానీ చివరికి కూటమి ప్రభుత్వం వస్తే పదివేల రూపాయలు వీరికి జీతం అందించేలా చేస్తామంటూ చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో వీరిపైన ఒక చర్చ కూడా జరిగింది. చాలామంది కోర్టుని ఆశ్రయించి మరి వేల సంఖ్యలలో వాలంటీర్లను కూడా రద్దు చేయించేలా చేశారు.


అయితే ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయి ఫలితాలు వెలబడినప్పటికీ కూడా రాజకీయాలు చేసినటువంటి వాలంటరీల సైతం ఇప్పుడు ఒకసారిగా రోడ్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో వైసిపి నేతలు ఎమ్మెల్యేలు బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పలువురు నేతలతో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది వాలంటరీలో మాజీ ఎమ్మెల్యేల పైన కూడా కేసు నమోదు చేయించేలా చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి 5000 నుంచి 10000 రూపాయలకు జీతాన్ని ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.


కూటమి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సర్పంచుల సంఘం ఒక కీలకమైన తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం గత ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలి అంటూ తీర్మానించింది..ఆ మేరకు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఈ విషయాలను సైతం తెలియజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సర్పంచులంతా తమ నెల జీతాన్ని కూడా రాజధాని నిర్మాణానికి సైతం విరాళంగా ఇవ్వాలి అంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు.. ఈ సమయంలోనే గ్రామాలకు సంబంధించిన 16 డిమాండ్లతో పాటు తమ డిమాండ్లను  కూడా సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందించారు రాజేంద్రప్రసాద్. మరి అనుకున్నట్టుగానే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: