* పిరికోడా... పిరికోడా.. అంటూ తీవ్ర విమర్శలు.!

* హద్దులు దాటేస్తున్న షర్మిల సెటైర్లు.!

* జగన్ మౌనానికి కారణం అదేనా.?

(అమరావతి-ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 175 సీట్లకు గాను 164 సాధించి వైసీపీ పార్టీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది.దాంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్ కు దక్కలేదు. అయితే జగన్ కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వమని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు ప్రత్యేక లేఖ కూడా రాసారు అయితే దానిపై ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ స్పీకర్ నుండి రాలేదు. దాంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా వరుసగా వెళ్లకుండా ఏవేవో కుంటి సాకులు చెప్పి అసెంబ్లీకి వెళ్ళడానికి సంకోచిస్తున్నారు.ఇదిలా ఉంటే జగన్ పై అధికార పక్ష నేతల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ అధినేత ఐనా జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.జగన్ కేవలం 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ ఆయన్ని వదలడంలేదు షర్మిల.రాజకీయంగానూ , వ్యక్తిగతంగాను షర్మిల చేస్తున్న విమర్శలు జగన్ కు, వైసిపికి బాగా ఇబ్బందికరంగా మారాయి. ఏపీలో  కూటమి అధికారంలోకి వచ్చినా, అవి కాంగ్రెస్ కు ప్రత్యర్ధులే అయినప్పటికీ వాళ్లను టార్గెట్ చేయకుండా పూర్తిగా జగన్ నే టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు చేస్తుండడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఇప్పటికి అంతు పట్టడం లేదు. అయితే షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లు ఇవ్వకపోవడంతో ఆమె మరింతగా తమ విమర్శల దాడి పెంచుతున్నారు.జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రజల సమస్యల ఫై అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలనీ..అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటె ఎలా అంటూ ప్రశ్నించింది.అసెంబ్లీకి వచ్చి నిలదీయండని అంటే, చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని జగన్ ఫై షర్మిల సెటైర్ వేశారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తనకు ఉందని, అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని అన్నారు.జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నామని, చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నామని అన్నారు.

వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేతకాదులే… మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమసంబంధం పెట్టుకున్నారు. వైఎస్సార్ ను వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు… మీ అహంకారమే మీ పతనానికి కారణం' అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లే అంశంపై షర్మిల ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం మరోటి వుండదని... ఆయనకున్న అహకారం, అజ్ఞానం ఎక్కడా కనబడవు, వినబడవని అన్నారు. బాధ్యతాయుతమైన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వుండి అసెంబ్లీ వెళ్లననడం సిగ్గుచేటు... మిగతా ఎమ్మెల్యేలకు ఇదేనా మీరిచ్చే సందేశం అంటూ షర్మిల మండిపడ్డారు.అయితే మోసం చేయడం వైఎస్ జగన్ కు కొత్తేమీకాదు... కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చూడలేదన్నారు. ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేస్తున్నారని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం ఆయనకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం అంటూ ఘాటుగా విమర్శించారు.అలాగే దానికి ఉదాహరణగా షర్మిల చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు.. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు... ఇలాగే ప్రజాతీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో... అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవడికి కావాలంటూ ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: