ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలు వచ్చాయి.. కానీ ఓటింగ్ శాతం మాత్రం 40% వచ్చింది. అయినప్పటికీ కూడా టిడిపి ఇంకా భయంగానే ఉన్నట్టు కనిపిస్తోందట.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉన్నంతవరకు ఎరోజు కైనా సరే ఖచ్చితంగా టిడిపి పార్టీకి ఎదురుదెబ్బే అన్నట్లుగా చాలామంది నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని చాలామంది నేతలు స్పీకర్ అయ్యన్నపాత్రుల వద్ద కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయాలు మారుతూ ఉంటాయని రాజకీయాలలో ఒకే చోటు ఉండడం జరగదనే విధంగా కూడా చెప్పవచ్చు.


ముఖ్యంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారికే పట్టం కడతారని కూడా ఎన్నోసార్లు రుజువయింది. వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లకు పడిపోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనే విధంగా ఫలితాల తర్వాత కూటమినేతలు చాలా సంబరపడ్డారు.. కానీ ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికార పార్టీకి కాస్త ఆయుష్షు తగ్గడం కూడా ప్రారంభమయ్యింది. ప్రజలు ఆదరించకపోతే ఏ పార్టీ అయినా కూడా కనుమరుగవుతుందని చెప్పవచ్చు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ని రాజకీయంగా నాశనం చేయాలని చూసినప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఇలా చేయాలనుకున్న ప్రతిసారి కూడా కూటమి అబాసపాలవుతోంది.


అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయాలని చూసినప్పటికీ అది చూస్తే భయమేస్తోంది అంటూ చంద్రబాబు చెప్పిన తీరు అటు కూటమి సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టే అవకాశం ఉందనే విధంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇది కూటమి వ్యతిరేక రావడానికి కూడా మారిపోతుంది.. అంతేకాకుండా గత పాలనలో సంక్షేమ పథకాలు క్యాలెండర్ ద్వారా విడుదల చేసి మరి ఆ డబ్బులను ప్రజల అకౌంట్లో జమ చేసేవారు జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని అది కూడా సంపాదన సృష్టించి ఇస్తానని హామీ ఇవ్వడం వల్లే ప్రజలు ఓటు వేయగా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగోలేదంటూ చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి ఇలాంటి పరిస్థితులలో కచ్చితంగా జగన్ చూస్తే టిడిపికి భయం వేస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాలలో టిడిపి నేతలు కూడా ట్రోల్ కి గురవుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ రాజకీయంగా ఎదవనీయకుండా చేయాలని చూస్తున్నాప్పటికీ అది సాధ్యపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: