ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇంటర్ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులకు 1,08,619 , 92,134 మంది సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు అందించనుంది ముఖ్యంగా ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతో పాటు సంబంధిత గ్రూపు పాఠ్యపుస్తకాలు అలాగే బ్యాగులు కూడా పంపిణీ చేయనుంది, ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి ఇవన్నీ మండల కేంద్రాలకు చేరాయని ప్రభుత్వం తెలిపింది.

అంతేకాదు గత ప్రభుత్వం లాగా కాకుండా పాఠ్యపుస్తకాలు , బ్యాగులు, నోట్ పుస్తకాలతో సహా విద్యార్థులకు అందించాల్సిన కిట్లు అన్నీ కూడా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై దృష్టి పెట్టారు.  అన్నట్టుగానే ఇంటర్మీడియట్ విద్యా శాఖ నిధులతో పుస్తకాలను ముద్రించడంతోపాటు అవసరమైన బ్యాగులు,  నోట్ పుస్తకాలను కూడా విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.. వచ్చేవారంలో ఇంటర్ విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇకపోతే గత ఐదేళ్ల వైసిపి పాలనలో కేవలం 2020 - 2021 సంవత్సరానికి గాను ఉచిత పుస్తకాలు అందజేశారని, మిగతా సంవత్సరాలకు మంగళం పాడారని స్పష్టం చేశారు నారా లోకేష్. అధికారంలోకి వచ్చాము కాబట్టి విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా   పాఠ్యపుస్తకాలు,  నోటు పుస్తకాలతో పాటు బ్యాగులు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.. ఇక త్వరలోనే విద్యార్థులకు కావలసిన అన్ని పుస్తకాలు అందజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది .పిల్లల భవిష్యత్తు చదువుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి సకాలంలో వారికి సరైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని కూటమి భావిస్తుందని స్పష్టం చేశారు టిడిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: