తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సిని పరిశ్రమ టికెట్ల రేటు విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాలను తెలియజేస్తేనే టికెట్ల పెంపు ఉంటుందనే విధంగా తెలియజేశారు. అలాంటి సమయంలో కేవలం కొంతమంది మాత్రమే వాటి మీద స్పందించారు.. ఇప్పుడు తాజాగా మరొకసారి  తెలుగు సినీ పరిశ్రమలో ఉండే నటుల పైన ఫైర్ అయ్యారు.. ఇటీవల గద్దర్ అవార్డుల పైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సైతం తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. తమిళ రచయిత.. శివశంకర్ కి, సి నారాయణ రెడ్డి కి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేసిన సందర్భంగా గద్దర్ అవార్డుల పైన కూడా స్పందించడం జరిగింది  సిఎం రేవంత్ రెడ్డి.


ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను సైతం గద్దర్ అవార్డుల పేరుతో భర్తీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.ఆమెరకు ఒక ప్రకటన కూడా తెలియజేసింది. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్ధవంతంగా అమలు చేయాలనే విషయం పైన పలు రకాల సూచనలను అందించాలి అంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఉండే కొంతమంది సెలబ్రిటీలను కూడా ముఖ్యమంత్రి కోరారట. దీనిపైన ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వారు ఎవరూ కూడా స్పందించలేదట.


ఈ క్రమంలోనే డాక్టర్ పి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సిని పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల చాలా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కృషికి విజయాలకు సైతం గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి అవార్డుల పైన సిని పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పటికైనా ఈ విషయం పైన టాలీవుడ్ పెద్దలు స్పందిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: