ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు జగన్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వేతనాలు పెంచలేదనే విమర్శ ఉన్నా చాలామంది వాలంటీర్లు తక్కువ పని గంటలు కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఏపీ వాలంటీర్లకు టెన్షన్ తగ్గలేదని తెలుస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానం చేయడం గమనార్హం.
 
టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తుల నుంచే ఇలాంటి ప్రకటనలు వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లను భయాందోళనకు గురి చేస్తే కూటమికే నష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ వాలంటీర్లు ప్రభుత్వం తమ టెన్షన్ ను తగ్గించాలని తమను ఇబ్బంది పెట్టొద్దని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వాలంటీర్ల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటే కూటమికే తీవ్రస్థాయిలో నష్టమని చెప్పవచ్చు. మరోవైపు వాలంటీర్ల వేతనాలను ఎప్పటినుంచి పెంచుతారనే ప్రశ్నలకు సైతం సరైన సమాధానం దొరకడం లేదు. వాలంటీర్లలో చాలామంది తమకు ప్రశాంతత లేదని చెబుతున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం లక్షన్నర మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లకు మాత్రం ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే లేదని క్లారిటీ వచ్చేసింది. కొత్తగా వాలంటీర్లను ప్రభుత్వం నియమించుకుంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వ్యతిరేకతకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు సైతం సరైన సమాధానాలు దొరకడం లేదు. వాలంటీర్లను ఏ విధంగా వినియోగించుకోవాలనే చర్చ సైతం జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: