పిల్లలు ఎక్కువగా సెలవుల కోసం చూస్తూ ఉంటారు.. ముఖ్యంగా దసరా సెలవుల కోసమే ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.. అలాంటి వారికి తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.ఆంధ్రప్రదేశ్లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 2024-2025 కి సంబంధించి అకాడమీక్ క్యాలెండర్ ని సైతం రిలీజ్ చేశారు.. నూతన విద్యా సంవత్సరంలో 232 రోజులు పని చేయనుండగా అన్ని రకాల కలిపి 83 రోజులపాటు సెలవులు ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగే ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయట.

ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మాత్రమే ఉంటాయట రెండు విభాగాలుగా చివరి పీరియడ్ ను పిల్లలు ఆడుకునేందుకు కేటాయించాలని సంబంధించిన వాటిని ఉంచేలా తెలియజేశారు. అలాగే ఒంటి పూట బడులు కూడా ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్న 12:30 నిమిషాల వరకు మాత్రమే ఉంటాయి.

ఇక దసరా సెలవులు విషయానికి వస్తే..4-10-2024 నుంచి 13-10-2024 వరకు ఉంటాయట.. క్రిస్మస్ సెలవులు కూడా 25-12-2024 .. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.

అలాగే సంక్రాంతి సెలవులు విషయానికి వస్తే
.10-1-2025 నుండి 19-1-2025 వరకు ఉండబోతాయని విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. మైనార్టీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి కేవలం 15వ తేదీ వరకు మాత్రమే ఉంటాయి.

ఇక పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ఉంటాయట. ఇలా మొత్తం ఈ ఏడాదికి వచ్చేయడానికి సంబంధించిన సెలవులకు సంబంధించి పూర్తి వివరాలను సైతం ఏపీ విద్యాశాఖ తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే ఈ అకాడమీ క్యాలెండర్ ని విద్యార్థులు ఫాలో అవ్వాల్సి ఉంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: