ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత ycp ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీ పథకంలో రూ.7వేల కోట్లను చెల్లించాల్సి ఉందని బీజేపీ మంత్రి సత్యకుమార్‌, ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించడం కలకలం రేపింది.ఇకపై ఏపీలో ఆయుష్మాన్ పథకమే అమలు చేయాలని అనుకుంటున్నారా అని షర్మిల ప్రశ్నించారు. ఈ సందర్భంగాషర్మిలకు క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాని..ఆరోగ్య శ్రీ పదకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా అంటూ వైఎస్ షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయుష్మాన్ భారత రీప్లేస్ మెంట్ కాదని ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: