ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు విషయంలో పలు రకాల శ్వేత పత్రాలను విడుదల చేశారు.. అలాగే కొన్నిచోట్ల జరిగిన అవకతవకలను సరి చేసే విధంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు తగు నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. మరి కొన్నిచోట్ల టిడిపి శ్రేణులు వైసిపి నేతలపైన కార్యకర్తల పైన కూడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో ఏపీ రాజకీయాలు చాలా ఉధృతతను కలిగిస్తున్నాయి.


తాజాగా ఇలాంటి సమయంలోనే సీఎం చంద్రబాబుతో మాట్లాడి మరి పేకాట ఆడించేందుకు కృషి చేస్తానంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కొన్ని వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో పేకాటను బ్యాన్ చేశారని.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని క్లబ్బులను ఏర్పాటు చేసి అక్కడ పేకాట ఆడించేందుకు కృషి చేస్తామంటూ తెలియజేశారు అనంతపురం ఎమ్మెల్యే. అందుకు సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ గా మారుతోంది. ఈ విషయాన్ని సైతం వైసీపీ నేతలు మరింత వైరల్గా చేస్తున్నారు.


గత వైసిపి పాలనలో పేకాటను బ్యాన్ చేసి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తే కూటమి సర్కార్ మాత్రం మళ్లీ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతుందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. దగ్గుబాటి ప్రసాద్ పేకాట విషయాన్ని అనంతపురం ఆఫీసర్ల క్లబ్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎలా స్పందిస్తారనే విషయం పైన చూడాల్సి ఉన్నది.. కూటమిలో భాగంగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యే సైతం కూటమినీ దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.. ముఖ్యంగా సీఎంగా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నప్పటికీ ఇలాంటి నేతల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే ఎలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: