* అప్పట్లో రాజకీయంగా దుమారం రేపిన నంది అవార్డ్స్

* నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్డ్స్ అంటూ పోసాని ఘాటు విమర్శలు

* టీడీపీ గవర్నమెంట్ లో టాలెంట్ తో పని లేదు కమ్మ అయితే చాలు అంటూ పోసాని మాస్ ట్రోలింగ్ ..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 లో రెండు రాష్ట్రాలుగా విభజితం అయింది. జూన్ 2 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.ఇక అదే  సంవత్సరం ఇటు తెలంగాణ లో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.అలాగే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు లభించింది.ఇరు రాష్ట్ర సీఎంలు చేసిన మంచి పనులను సినీ ప్రముఖులు అభినందిస్తూ వచ్చారు.దీనితో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పలు స్టార్ హీరోల ,అలాగే చారిత్రాత్మక కంటెంట్ వున్నా సినిమాలకు ప్రత్యేక రాయితీ ఇచ్చి ప్రోత్సహించారు.

అలాగే ప్రతి ఏడాది నంది అవార్డ్స్ ప్రధానోత్సవం జరిపి టాలెంట్ వున్నా నటి నటులకు అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది.అయితే ఆంధ్రప్రదేశ్ లో 2014,2015,2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను నాగి రెడ్డి ,చక్రపాణి జాతీయ అవార్డు ,రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించింది.దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందించిన జ్యూరీ సభ్యులు ఆ వివరాలను అందించారు.

ఆ కమిటీ ప్రతినిధులుగా నందమూరి బాలకృష్ణ ,మురళి మోహన్ ,గిరిబాబు వంటి తదితరులు పాల్గొని వివరాలు అందించారు. అయితే ఈ అవార్డ్స్ అప్పట్లో వివాదానికి దారి తీశాయి.బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు అన్ని క్యాటగిరీలలో అవార్డ్స్ రావడం విమర్శకు దారి తీసింది.ఇదిలా ఉంటే టెంపర్ సినిమాకు గాను అద్భుతమైన నటనకు పోసాని కృష్ణ మురళికి అవార్డు లభించింది.కానీ ఈ అవార్డ్స్ విషయంలో చాల మంచి సినిమాలకు అన్యాయం జరిగిందని పోసాని విమర్శించారు.

అవార్డ్స్ జ్యూరీ సభ్యులలో చాలా మంది  కమ్మవారే ఉండటంతో కమ్మ క్యాస్ట్ సినిమాలకు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని ఆయన విమర్శించారు.దీనితో ఇవి నంది అవార్డ్స్ కాదని కమ్మ అవార్డ్స్ అని అలాగే సైకిల్ అవార్డ్స్ అని ఆయన విమర్శించారు.టాలెంట్ ప్రకారం అవార్డ్స్ అందించాలని పోసాని కోరారు..ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఎంతో పారదర్శకంగా నంది అవార్డ్స్ అందించాలని పోసానిని జ్యూరీ మెంబెర్ గా చేయడం జరిగింది.దీనితో పోసాని మరియు  జ్యూరీ సభ్యులు కూడా టాలెంటెడ్ సినిమాలకి అవార్డ్స్ అందించాలని సూచించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: