* రాజకీయా అండతో సినీ ఇండస్ట్రీను అడేసుకున్న తీరు!

* కళామ్మ తల్లీ పై ఉక్కుపాదం మోపిన రాజకీయం!

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది.ఏపీలో ముఖ్యమంత్రిగా  వైఎస్ జగన్ కొనసాగుతున్న టైంలో ఆయన్ని కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేశారు. అయితే ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ ఒక డౌట్ అనేది వెంటాడుతూ వచ్చింది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కచ్చితంగా మొదలవుతాయని వాళ్ళు భావించారు.గత ఐదేళ్లకాలంలో సామాన్యలు ఎంతో వేధించబడ్డారో, సినిమా పరిశ్రమ కూడా అంతే జగన్ ప్రభుత్వం వలన ఒడిదుడుకలకుగురైంది. టికెట్ రేట్లు మొదలు, సినిమా హీరోల రెమ్యూనిరేషన్‌లపై అనవసరపు కామెంట్స్.. స్టార్ హీరోలను జగన్ తన క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని అవమానకరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇలా పైకి కనిపించేలా, కనిపించని రీతిలో అనేక విధాలుగా సినీ పరిశ్రమకు సంబందించిన వ్యక్తులను, వ్యవస్థలను వైసిపి ప్రభుత్వం చిన్న చూపు చూసింది .ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తిగా, చంద్రబాబు నాయుడుకు తోడుగా నిలబడి, తెలుగు రాజకీయాలలో మునుపెన్నడు లేనటువంటి విజయం సాధించటంలో, కీలకపాత్ర పోషించారు. అందుకేనెమో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందుకున్న విజయాన్ని ఇండస్ట్రీ తన విజయంగా ఓన్ చేసుకున్న సిట్యువేషన్ కనిపిస్తుంది. ఇక కూటమి విజయం సాధించిన తర్వాతనే, తమ సినిమాలను రిలీజ్ చేయాలనే సంకల్పంతో పలువురు నిర్మాతలు వెయిట్ చేశారు. గత ఐదేళ్లుగా ఏపీతో చిత్ర పరిశ్రమకు రిలేషన్ తగ్గుతూ వచ్చిన తరుణంలో, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటంతో అన్నీ వ్యవస్దలతోపాటు, ఏపీలో చిత్ర పరిశ్రమ కూడా గ్రౌండ్ లెవెల్‌లో గాడిన పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

2024 ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ పతనం పాతాళానికి పడిందంటే దానికి ప్రతిపక్షాల పోరాటాలు ఒక అస్త్రంగా నిలిస్తే జగన్ చేసుకున్న స్వీయ తప్పిదాలు మరో అస్త్రంగా మారాయని చెప్పాలి. ఒక అహంకారికి అధికారం చేతిలో పెడితే ఎం జరుగుతుందో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చవి చూసారు. ఇందులో సామాన్యుడు నుంచి రాజకీయాలతో సంబంధం లేని సెలబ్రెటీల వరకు అందరు జగన్ బాధితులే కావడం ఇక్కడ కొస మెరుపు. పద్మ అవార్డుల గ్రహీతలు సైతం వైసీపీ నేతల అవమానాలను, చీత్కారాలను ఎదుర్కోక తప్పలేదు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు వైసీపీ మాట దాడిలో గాయపడినవారే. జగన్ అధికారంలోకి వచ్చాక సినీ ఇండస్ట్రీని దెబ్బకొట్టేలా సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ జీవో జారీ చేసారు. దీనితో సమస్య పరిష్కారానికి ఇండస్ట్రీ పెద్దలంతా తాడేపల్లి ప్యాలస్ గేట్ కొట్టారు. చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి సినీ దిగ్గజాలు మొత్తం తమ ఇండస్ట్రీ బాగు కోసం జగన్ ముందు చేతులు చాచాల్సిన దుస్థితి తీసుకువచ్చారు జగన్. పవన్ మీద ఉన్న ఆక్రోశం, కోపం, ద్వేషం మొత్తం చిరుని అవమానించడంతో చల్లార్చుకోవాలి భావించిన జగన్ తీరు అనేది ప్రజలందరికి అర్ధం అయింది.ఆ విధంగా పవన్కళ్యాణ్ పై ఆక్రోశంతో వైసీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పై ఉక్కుపాదం చూపింది. ప్రస్తుతం ఆ కళామ్మ తల్లీకి మన రాష్ట్రంలో మంచిరోజులు వచ్చాయని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: