•సినిమా వర్సెస్ రాజకీయం..

•ఈ రెండింటిని శాసించేది ప్రజలే.

•ఈ విషయాన్ని సెలబ్రిటీలైనా.. నాయకులైనా.. గుర్తిస్తారా..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయ నాయకులకు సినీ సెలబ్రిటీలకు మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పాలి. అయితే తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ సినిమా వర్సెస్ రాజకీయం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరి భవిష్యత్తును తేల్చాల్సింది ప్రజలే కానీ ఎవరికి వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ తెగ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో విషయాలలో సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయ రంగం మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ టికెట్లు రేట్లు పెంచకుండా రాజకీయ నాయకులు అడ్డుపడితే , రాజకీయ నాయకుల బాగోతాలను సినిమా రూపంలో బయటపెడుతూ వారి రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బయోపిక్ల రూపంలో ఎలాంటి వారినైనా సరే చూపిస్తూ ఎవరికివారు విమర్శించుకున్నారు. అయితే ఇక్కడ ఎవరు ఎవరిని శాసిస్తున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.


ఇకపోతే సినిమాల ప్రభావం రాజకీయాల మీద.. రాజకీయాల ప్రభావం సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి సత్తా చాటుతుంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపించారు. ఎక్కువగా సినిమా వాళ్ళని కూడా రాజకీయం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో బాగానే బుల్లితెర ఆర్టిస్టులు కూడా ఆయన కోసం వచ్చే ప్రజలతో మమేకమవుతూ ప్రచారాలు నిర్వహించారు. ఇక అందరి కష్టం ఫలించింది.  ఆయన డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు ప్రస్తుత కాలంలో సినిమాలు రాజకీయాలు ఎవరు దేనిని శాసిస్తున్నారు అంటే ప్రజలే ఈ రెండింటిని శాసిస్తున్నారని చెప్పవచ్చు. సినిమాలు బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారు. రాజకీయ నాయకుల పనితీరు కనిపిస్తేనే ప్రజలు మళ్ళీ ఓటేస్తారు. కాబట్టి అటు సినిమా రంగమైనా ఇటు రాజకీయరంగం అయిన ప్రజల చేతుల్లోనే ఉంది అని చెప్పవచ్చు.

ప్రజల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా, ముందడుగులు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: