ఇప్పటికే కేటాయించిన 15 కోట్ల పని దినాలను జూన్ నెల కరికే పూర్తి చేయాలంటూ తెలిపారు. నిన్నటి రోజున ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశంలో వీటిని ఆమోదించారు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దీంతో ఉపాధి పని చేసుకునే వారికి మరిన్ని ఎక్కువ రోజులు ఉపాధి అవకాశం లభిస్తుంది అంటూ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే 54 లక్షల కుటుంబాలకు సైతం ఈ లబ్ధి చేరుతుందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరైన 15 కోట్ల పని దినాలు జూన్ నెల కరికే పూర్తి అవ్వగా అదనపు పని దినాల కోసం ప్రతిపాదనలు పంపించారు.
దీంతో ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సమావేశంలో ఈ విషయాలను ప్రస్తావించక వారు అంగీకరించారు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.అలాగే ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తామంటూ కేంద్రం అందుకు అంగీకరించినట్లుగా కూడా తెలియజేశారు. ఇందుకు ప్రధాన మోడీ నరేంద్ర మోడీకి కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలను తెలియజేశారు. అలాగే అటవీశాఖ ఉద్యోగుల పైన దాడి చేస్తే ఎవరికైనా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అటవీ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి వాటినైనా సరే అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.