ఈ అంశాలపై అసలు వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ స్పందించడం లేదు. అయితే తాజాగా... జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని కూడా తగ్గించేశారు. ఫోర్ ప్లస్ ఫోర్ కు తగ్గించింది ప్రభుత్వం. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా లేదన్న నేపథ్యంతో... ఈ మాత్రం సెక్యూరిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ప్రభుత్వం. కానీ ఆయన మాజీ ముఖ్య మంత్రి అన్న విషయం మర్చిపోయిన చంద్రబాబు ప్రభుత్వం... సెక్యూరిటీని మాత్రం తగ్గించేసింది.
అయితే ఈ విషయం తాజాగా పార్లమెంటులో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటివరకు వైసీపీ నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తగ్గించారని ఎవరికీ తెలియదట. అంతలా వైసీపీ సోషల్ మీడియా అలాగే నేతలు వీక్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఆయన చెప్పే సెక్యూరిటీలో ఓ విభాగం పోలీసు లను మార్చి వేరే పోలీసులను పెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసింది టిడిపి అలాగే సోషల్ మీడియా. చంద్రబాబు కు ప్రాణహాని తెచ్చేలా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. కోర్టు లో కేసు కూడా వేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కి ఇంత అన్యాయం జరిగినా కూడా వైసిపి పార్టీ నేతలే స్పందించడం లేదు.