ఆంధ్రప్రదేశ్లో వాలంటరి వ్యవస్థ పైన రోజుకు ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్ కూడా దీనిమీద ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటరీ వ్యవస్థకు సరికొత్త లుక్ లో చూపించాలని ఏపీ సీఎం భావిస్తున్నారట. అలాగే వాలంటరీ సేవలను కూడా మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా వాలంటరీల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టించాలా చేయాలని తెలుపుతున్నారు.


అలాగే వాలంటీర్ల విద్యార్హతలు వయసు వారి వివరాలను కూడా సేకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. వాలంటరీలో పీజీ చేసిన వారికి ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వారు 30 శాతం మంది ఉండగా డిప్లమా చేసిన వారు రెండు శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వారు 48% పదవ తరగతి పూర్తి చేసిన వారు 13 శాతం ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అలాగే 20 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉన్నవారు 20% ఉన్నారని.. 26 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు 34 శాతం అని.. 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు 25 శాతం మంది ఉన్నట్టుగా వాలంటరీల గుర్తించారట ఏపీ ప్రభుత్వం.


వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్ధ్యాలను పెంచి వారికి సరికొత్త ప్రణాళికలను చూపించే విధంగా కూడా అడుగులు వేస్తామని. అలాగే వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే పరిమితి సంకేతం వాలంటరీల వ్యవస్థను కొనసాగిస్తామంటూ కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. వచ్చే క్యాబినెట్ సమావేశాలలో వీటిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపారు.. అయితే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 1,53,908 మంది వాలంటరీ లో ఉన్నారని. ఎలక్షన్స్ ముందు లక్ష పదివేల రూపాయలు రాజీనామా చేశారని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న వారితో గౌరవ వేతనం కింద పదివేలు చెల్లించాలంటే రూ.1848 కోట్ల రూపాయలు ప్రతినెలా ఖర్చు అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: