వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పదానికి కొత్త అర్థం చెబుతూ షర్మిల ఈసారి మరో అడుగు ముందుకేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె ఎత్తిచూపారు. కొత్త పూర్తి రూపాన్ని ప్రతిపాదించారు: వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి (విజయసాయిరెడ్డి), ఆర్ అంటే రామకృష్ణారెడ్డి (సజ్జల) అని ఆమె కొత్త అర్థం చెప్పి షాప్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోని ప్రస్తుత నేతలు గతంలో వైఎస్‌ఆర్, విజయమ్మలను అగౌరవపరిచారని షర్మిల అన్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయకుంటే ఇప్పుడు వైఎస్‌ఆర్ విగ్రహాలు ధ్వంసం అయి ఉండకపోయేవని, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చకపోయి ఉంటే వైఎస్‌ఆర్ పేరును తొలగించాల్సిన అవసరం రాకపోయి ఉండేదని ఆమె అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరే బాధ్యులు అని జగన్‌ను లాజిక్ తో ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టారు.
వైసీపీకి ఆమె ఇచ్చిన నిర్వచనం, దానికి మద్దతుగా ఆమె చేసిన వాదనలు వైసీపీ శిబిరంలో చికాకు కలిగిస్తున్నాయి. జగన్ అసెంబ్లీకి రాకపోవడం తీవ్రమైన అంశమని, దీనికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె ఉద్ఘాటించారు. షర్మిల ప్రస్తుతం అన్న జగన్కు పక్కలో బల్లెం లాగా తయారయ్యారు. కనీసం ఆమెనైనా తన వైపు తిప్పుకోలేకపోతున్నారు జగన్. మరి ఈ సింగిల్ సింహం వచ్చేసారి గెలుస్తారో లేదో చూడాలి.