పిఠాపురంలో టిడిపి నేత వర్మ అంటే తెలియనివారు అంటూ ఎవరు ఉండరు.. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కు తన సీటును త్యాగం చేసి మంచి పాపులారిటీ సంపాదించు కున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గెలిచేందుకు కూడా తన సాయి శక్తుల కష్టపడ్డాడు వర్మ. అయితే గెలిచిన తర్వాత కొద్ది రోజులు ఆయన హవా బాగానే చేసిన ఈ మధ్యకాలంలో పెద్దగా ఈయన పేరు వినిపించలేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఈయన త్యాగానికి సముచిత స్థానం కల్పిస్తామంటూ తెలియజేశారు.


దీంతో ఈయన కార్యకర్తలు ఈయనకు మంత్రి పదవి వస్తాదని ఆశించారు. కానీ కూటమి వచ్చి ఇప్పటికీ 50 రోజులు అవుతూ ఉన్న ఎలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఇక రెండు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా ఒకటి జనసేన మరొకటి టిడిపి తీసుకుంది. ఈ విషయం పైన కూడా వర్మ హర్ట్ అయ్యారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అప్పటినుంచి పెద్దగా ఈయన బయటికి కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈయన పైన వర్మ- బర్మా అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయట. దీని వెనక జనసేన పార్టీకి చెందిన కిలకమైన నాయకుడు ఉన్నారనే విధంగా వర్మ వర్గ్యులలో వార్తలు వినిపిస్తున్నాయట.


వాస్తవానికి వర్మకు అడ్డుపడుతున్నది కూడా ఆయనేనని కానీ ఎవరు బయటపడడం లేదట. వర్మకు ఎలాంటి పదవి ఇచ్చిన కూడా నియోజకవర్గంలో నెంబర్ వన్ లేదా నెంబర్ 2 గా ఉంటారని ఇది జనసేన పార్టీకి ఇబ్బంది అని తెలుసుకుని వారే ఇలా చేస్తున్నారని అక్కడి కార్యకర్తలు వాపోతున్నారు కానీ వర్మ అభిమానులు అనుచరులు మాత్రం తమ నాయకుడిని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని కూడా తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదురుతుందా లేకపోతే ఇక్కడితో ఆపివేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: