* పాదయాత్రతో చరిత్ర సృష్టించిన వైయస్సార్

* తండ్రి స్లోగన్ ను ఆయుధంగా మార్చుకున్న జగన్


(ఆంధ్రప్రదేశ్-ఇండియహెరాల్డ్ ): యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వైయస్సార్ అంటే మాత్రం ఏపీ ప్రజలలో తెలియనివారు ఉండరు. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎంగా తెలుగువారి ముఖాల్లో చిరునవ్వులు చిందించారు. రైతులకు ఉచిత కరెంటు, 108,ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఫీ రీఎంబర్స్మెంట్ వంటి హిస్టరికల్ పధకాలతో చరిత్రలో నిల్చిపోయారు.వైస్సార్ కళాశాల టైములోనే విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహారించారు.అప్పటినుండే రాజకీయాలపై ఆసక్తి ఉన్న వైయస్సార్ ఆ కళాశాలలోనే హౌస్ సర్జన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత పులివెందులలో తండ్రి రాజారెడ్డి పేరు మీద కట్టించిన హాస్పిటల్ లో డాక్టర్ గా కూడా చేసారు.రాజకీయాలపై ఆసక్తి చూపిన వైస్సార్ 1980-83 మధ్య మంత్రిగా చేసారు. కడప లోకసభనుండి నాలుగు సార్లు ఎంపీగా అలాగే పులివెందుల అసెంబ్లీ నుండి ఆరు సార్లు ఎన్నికయ్యారు.రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా, రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసారు.ఆయన 1984-94 మధ్య సీఎం కావడానికి అనేక ప్రయత్నాలు చేసిన అవ్వలేక పోయారు.ఆయన అప్పటి సీఎంలు మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.రాజకియంలో ముక్కుసూటి తనానికి,నిర్మొహమాట ధోరణికి ఆయన ప్రసిద్ధుడు.ఆయన మొదటిసారి 1999లో సీఎం అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి గెలవలేదు.ఆ తర్వాత 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర వల్ల సీఎం సీట్ ను అధిరోహించారు.

అయితే సీఎం అయ్యాక ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు నీరజనం పట్టి మరల 2009 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో రెండవసారి సీఎం అయ్యారు.చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగిన్నందుకు వైయస్సార్ రాజీనామా చేయాలనీ విపక్షాలు కోరాయి.అక్రమాస్తుల కేసులపై 2011 సంవత్సరములో ఆయనపై అలాగే జగన్ పై సిబిఐ వారు అభియోగ పత్రం జారిచేసారు.ఎన్నో అవరోధాలు దాటుకొని వైయస్సార్ ప్రజల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. పేదవాళ్లకు ఆయన చేసిన మంచి మాత్రమే కనబడింది అదే ఆయన్ను ఉన్నత స్థితికి చేర్చింది.అలాంటి వైయస్సార్ 2009 సెప్టెంబర్-2 న కొత్తగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి ప్రమాదంలో మరణించారు.

అయితే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు చాలా మంది గుండె పోటుతో మరణించారు. దాంతో జగన్మోహనరెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారు. దానికి ఒప్పుకొని కాంగ్రెస్ నుండి జగన్ బయటకి వచ్చేశారు ఆయనతో పాటు 19మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటికి వచ్చారు. 2011 లో వైస్సార్సీపీ పార్టీ పెట్టి అప్పటి ఉపఎన్నికల్లో ఏకంగా 13 సీట్లు సాధించారు. ఆ తర్వాత జగన్ ను అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయగా జగన్ చెల్లెలు షర్మిల పార్టీని ముందుండి నడిపించారు. జైలు నుండి విడుదల ఐనా జగన్ 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిగా పోటీచేసిన 60కి పైగా స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందారు. ఆ తర్వాత 2019ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. గడిచిన అయిదేళ్లలో ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారు. అయితే కూటమికి ప్రజల్లో బాగా జనదారణ రావడంతో జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమతమయ్యారు.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr