ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సవాళ్లు ఎదుర్కోబోతోంది.. స్థానిక  సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది.. ప్రతిపక్ష వైసిపికి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో గెలుపు కూటమి పక్షానికి ఒక ఛాలెంజ్గా మారింది. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలకు జరిగే మొదటి ఎన్నికలలో విజయం సాధించడం ఇది చంద్రబాబుకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతోంది. ఈ సమయంలోనే సెట్టింగ్స్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం కూడా వైసిపి ఒక పెద్ద సవ్వాల్నే ఎదుర్కొంటుంది..


అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు కూడా జారుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సీట్లను నిలబెట్టుకోగలద తిరిగి ఆధిపత్యం ప్రదర్శించగలరా అనేది ఎప్పుడు విశాఖ విజయంతో తేలబోతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. ఈ సమయంలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఈసీ షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది.. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలతో కూటమి ప్రభుత్వానికి మొదటి పరీక్ష ఇదే అన్నట్టుగా తెలుస్తోంది.


ఈ పరిస్థితులలో అటు వైసీపీకి కూటమి పార్టీకి ఒక సవాలుగా విశాఖ ఎమ్మెల్సీ స్థానం మారబోతోంది. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రిజైన్ చేయడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ముందుకు రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరారు. ఆ తర్వాత విశాఖపట్నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్సీ స్థానంలో 841 ఓట్లు ఉన్నాయి ఇందులో వైసీపీకి 615 ఓట్లు ఉండగా టిడిపికి 215 ఉన్నాయి.. దీన్ని బట్టి చూస్తే వైసిపిని ఆదిపత్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏంటో 24 ఎన్నికలలో వైసిపి లెక్కలన్నీ కూడా మారిపోయాయి. ఇప్పటికే విశాఖలో పలువురు కార్పొరేటర్లు వైసిపికి రాజీనామా చేసి టిడిపి జనసేనలో చేరేలా కనిపిస్తున్నారు. ఆగస్టు 6న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 30న ఎన్నికలు జరగబోతున్నాయట. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారట. పోటీ ఉంటే ముప్పయిన ఎన్నిక జరుగుతుంది లేకపోతే ఏకగ్రీవం అవుతారా అన్నది చూడాలి. ఇంకా అధికార పార్టీ అభ్యర్థి ఎవరు అనే విషయం క్లారిటీ రాలేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: