ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ సీనియర్ లీడర్ గా పేరు పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటిది ఆయన ఇప్పుడు కొత్తగా హామీలను అమలు విషయంలో కూడా నెలరోజుల సమయం సరిపోతుందని హనీమూన్ పీరియడ్ అంటూ కూడా ఆరు నెలల సమయం తీసుకుంటే మిగిలిన వారికి చంద్రబాబుకు తేడా ఏంటి అనే విషయం మీద వైసిపి నేతలు చాలామంది వాక్యానిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మీద అటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడడం జరిగింది.


ప్రస్తుతం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడానికి కనీసం ఆరు నెలల సమయం అన్న ఇవ్వాలి అని ఈ ఏడాది చివరి వరకు వేచి ఉండాలి అంటూ ఆయన తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి మాన్ డేట్ ఇచ్చారని కూడా తెలిపారు. కొంతమంది ఈ గెలుపు ఈవీఎంల వల్ల వచ్చింది అని 49 లక్షల ఓట్లు మ్యానిక్యులేట్ అయి ఉంటాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయని అన్ని పార్టీలు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాయంటూ తెలిపారు.


అలాగే అఖిలేష్ యాదవ్ లాంటివారు 80 కి 80 వచ్చిన ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదంటున్నారని తెలియజేశారు. తాను కూడా ఈవీఎం విషయంలో వారి అభిప్రాయాలను ఏకీభవిస్తున్నామంటూ కేతిరెడ్డి తెలియజేయడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు ఈవీఎంల పైన పలు రకాల ఆరోపణలు చేశారని ఇప్పుడు ఫలితాలు అనుకూలంగా రావడంతో ఈవీఎం పద్ధతే బాగుంటుందంటూ వెల్లడిస్తున్నారని కేతిరెడ్డి తెలిపారు.. అయితే తాము చేసిన పొరపాట్లు లేకపోతే చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల తెలియదు కానీ ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి.. కాస్త సమయం ఇవ్వాలి అద్భుతాలన్నీ అప్పుడే జరిగిపోతాయని అనుకోకూడదు ఈ ఏడాది చివరి వరకు వారికి సమయం ఇవ్వాలని తెలియజేశారు.. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: