• రాజకీయాల్లో దూసుకుపోతూ తండ్రి ఎర్రంనాయుడు పేరు నిలబెట్టిన రామ్మోహన్ నాయుడు! 

• హ్యాట్రిక్ ఎంపీగా, చిన్న వయసులో కేంద్ర మంత్రిగా రికార్డులు సృష్టించిన రామ్మోహన్ నాయుడు! 


కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా 16వ 17వ 18వ లోక్‌సభ సభ్యుడుగా రికార్డ్ సృష్టించాడు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రామ్మోహన్ కేంద్రమంత్రి వర్గ సభ్యులు, ఆయన దివంగత మాజీ ఎంపీ ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడు. తన తండ్రి లెగసీని కొనసాగిస్తూ యంగ్ లీడర్ గా దూసుకుపోతున్నాడు. రామ్మోహన్ ఇంజనీరింగ్లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన పినతండ్రి కింజరాపు అచ్చంనాయుడు సమక్షంలో రామ్మోహన్ ప్రవేశించారు. ఎర్రన్నాయుడు, అతని సోదరుడు అచ్చన్నాయుడు కూడా 26 సంవత్సరాల వయస్సునుండే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు.రామ్మోహన్ నాయుడు భారత పార్లమెంటు సభ్యులలో ఉన్న యువకులలో ఒకడుగా రికార్డ్ సృష్టించాడు. ఆయన వరుసగా మూడు సార్లు 16వ 17వ 18వ లోకసభ కు వరుసగా ఎన్నికైనారు. 


రామ్మోహన్ లోక్‌సభలో హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక , సంస్కృతి మంత్రిత్వ సాఖ, అధికార భాష , వెనుకబడినతరగతుల సంక్షేమం కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.జూన్ 9 వ తేదీ 2024 న కేంద్ర మంత్రి వర్గం లో ఏకంగా కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తి గా రికార్డు సృష్టించారు. 18వ కేంద్ర మంత్రివర్గంలో కింజరాపు రామ్మోహన నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. తన మాట తీరుతో జనాలని, పార్లమెంట్ సభ్యులని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు రామ్మోహన్ నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: