ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కేసులో అరెస్ట్ అయి విడుదలయ్యారు. ఆమె ఇక ఇంటికే పరిమితం అని అందరూ అనుకున్నారు కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ మాజీ సీఎం జగన్ ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆమె బ్యూరోక్రాటిక్ కెరీర్ ముగిసిందని చాలా మంది నమ్ముతారు, కానీ జగన్ భిన్నంగా ఆలోచించి ఆమెను రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు శ్రీలక్ష్మితో పాటు ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన కొత్త షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది జనవరి 24న శ్రీలక్ష్మి తన తండ్రి యర్రా నాగేశ్వరరావు పేరుతో మచిలీపట్నంలో పార్కును ప్రారంభించినట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ వెల్లడించాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పార్క్‌కు శ్రీలక్ష్మి స్వయంగా నిధులు సమకూర్చలేదు. బదులుగా, ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సొమ్మునే వాడేసారట. ఈ పార్కు కోసం ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ విభాగం రూ.2 కోట్లు, మచిలీపట్నం మున్సిపాలిటీ రూ.18 లక్షలు వెచ్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మచిలీపట్నంలోని శ్రీలక్ష్మి తండ్రికి అంకితం చేసిన పార్కుకు ప్రభుత్వ నిధుల నుంచి మొత్తం రూ.2.18 కోట్లు వెచ్చించారు. తన స్వగ్రామంలో తన తండ్రిని సన్మానించాలన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కోరికకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను వెచ్చించింది. అదనంగా, ఆమె తండ్రి రావు విగ్రహాన్ని పార్కులో ఉంచారు. అయితే ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం రిపోర్ట్స్ మాత్రం ఈ వ్యవహారం వాస్తవమే అన్నట్టు తెలుపుతున్నాయి.
ఒకవేళ ఈ విషయం నిజమైతే ప్రభుత్వం నిధులను ఉంటే వినియోగం చేసినందుకుగాను ఆమె లీగల్ చార్జెస్ ఫేస్ చేయవచ్చు. ప్రూఫ్స్ ఉంటే జైలుకే పరిమితం కావచ్చు. ఎవరి పైన రాని ఆరోపణలు ఆమె పైనే ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక ఈమె ఒక్కరే కాదు మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అంటే అవినీతి అక్రమాల ఆరోపణలను ఫేస్ చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వారిపై తగిన చర్యలు చేసుకోవచ్చు.