2024 ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని మరి టిడిపి పార్టీని కూడా కలుపుకొని ఎన్నికల భాగంగా కూటమిగా నిలబడడం జరిగింది. దీంతో ఎన్నికలలో భారీ ఘనవిజయాన్ని కూడా అందించుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలను అందుకున్నారు పవన్ కళ్యాణ్.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమిలో చాలా కీలకమైన నాయకుడిగా మారిపోయారు. అంతేకాకుండా ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిన ఫిర్యాదులను తెలియజేసిన కూడా వాటిని పరిష్కరించేందుకు తానే ముందుండి ప్రయత్నిస్తూ ఉన్నారు.



ఇలాంటి సమయంలోనే ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకునేందుకు మరో ముందడుగు వేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు కేవలం ఏపీ సీఎంవోకు ఉన్న మాత్రమే సోషల్ మీడియా హ్యాండిల్ ని సైతం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో మార్చడం జరిగింది. ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం అనే పేరుతోనే దర్శనమిస్తున్నాయి. ఈ సోషల్ మీడియా పేర్లన్నిటిని కూడా జనసేన పార్టీ తమ అధికారికంగా వాట్సాప్ గ్రూప్ లలో కూడా పంచుకోవడం జరుగుతోందట. దీంతో అభిమానులు జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వీటిని ఫాలో కావాలి అంటూ తెలియజేస్తున్నారు.


దీన్ని బట్టి చూస్తే 2029 ఎన్నికలలో తనదైన ముద్ర వేసుకొని సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో తాను చేస్తున్న కార్యక్రమాలు భేటీలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఈ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది షేర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. తద్వారా ఏదైనా సమస్యలను ప్రజలతో పంచుకునేందుకు వీలు కలిగే విధంగా వీటిని మెయింటైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన సొంత ఇమేజ్ కోసం పవన్ కళ్యాణ్ మరొక ముందడుగు వేసి ఇలా చేస్తూ ఉండడంతో అటు కార్యకర్తలు సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: