భారత్ నుంచి పంజాబ్ ను వేరుచేయాలనే కుట్రలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఖలీస్తాన్ ఉద్యమానికి అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో ఖలీస్థానీ తీవ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. ఖలీస్థానీ మద్దతు దారులకు ఆయా దేశాలు ఆశ్రయం కల్పిస్తూ.. ఈ ఉద్యమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వీరి ప్రధాన ఉద్దేశం భారత్ ను ముక్కలు చేయడం.
గురు ద్వార్ లో ఇప్పటి వరకు కాషాయ జెండా రెపరెపలాడుతూ ఉండేది. సిక్కు మతం అనేది హిందుత్వంలో ఓ భాగం అని నమ్మేవారు. ఒకనాడు సిక్కు మత గురువులకు అవమానం జరిగిందనే ఉద్దేశంతో ప్రతి హిందువు కూడా తమ ఇంటి నుంచి పెద్ద బిడ్డను సిక్కులుగా మార్చి వారికి దత్తత ఇచ్చేశారు. అంటే ఈ రెండు మతాల వారి మధ్య అంత స్నేహం, సమన్వయం ఉండేది.
కానీ ప్రస్తుతం వీరి మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని పలువురు గోతి కాడ నక్కలా కాచుకొని కూర్చొన్నారు. ఇప్పుడు గురుద్వారాలో కాషాయ జెండాను తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కాషాయం బదులుగా నావీ బ్లూ జెండాలను కట్టాలని గురుద్వారా ల పెద్ద ఎస్ఈబీసీ ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు పసుపు జెండాలు, మరోవైపు నావి బ్లూ జెండాలు ఉండేలా చూసుకోనున్నారు. ఒక్క గురుద్వార్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానాన్ని ఫాలో కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం సంచలనంగా మారింది.