రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం సర్వసాధారణం. అధికారంలో ఉన్నామని విర్ర వీగితే అధికారం కోల్పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఒక్కసారిగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడి పోయింది. వైనాట్ 175 అని నినాదం ఇస్తే.. ప్రజలు దానిని ఆహ్వానించగకపోగా.. చివరకు ప్రతిపక్ష హోదాని కూడా కట్టబెట్లేదు. పైగా తనకు ప్రతిపక్ష హొదా ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


అయితే ఇదిలా ఉండగా… ఏపీలో ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. తొలిరోజు మినహా మిగతా అన్ని రోజులు వైఎస్ వీటికి గైర్హాజరయ్యారు. దీంతో ఆయన శాసన సభకు వస్తారా రారా అనే ప్రశ్నలు అందరిలో మొదలు అయ్యాయి.  జగన్ అసెంబ్లీకి వస్తేనే ఆయనకు పార్టీకి మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అవమానించారు. అయినా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు అసెంబ్లీకి హాజరు అయ్యారు. తనకు సాధ్యమైనంత వరకు వైసీపీకి ఎదురొడ్డారు.


చివరకు తన భార్య విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో మస్తాపానికి గురై సీఎం హోదాలోనే సభలో అడుగుపెడతామని శపథం చేసి గెలిచి.. అడుగు పెట్టారు. అయితే అసెంబ్లీలో ఏం జరిగేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి హాజరు అయితే మైక్ ఇవ్వకపోయినా.. ఆయన్ను అవమానించినా.. అడ్డు తగిలినా.. అవహేళన చేసినా భరించాలి. అప్పుడే ప్రజల్లో సానుభూతి రైజ్ అవుతుంది. అప్పుడు జనాల్లోకి వెళ్లి నేను మాట్లాడాదామన్నా చంద్రబాబు మైక్ ఇవ్వడం లేదు అని చెప్పవచ్చు. పైగా ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయట పెడుతూ వస్తోంది. వీటికి కౌంటర్ చేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా ఉంటే వీటిని అంగీకరించినట్లే అవుతుంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: