తాడిపత్రిలో రాజకీయంగా తిరుగులేని ఫ్యామిలీ గా పేరు పొందింది జెసి కుటుంబం.. 2024 ఎన్నికలలో కూడా తమ హవా చూపించారు.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జెసి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల ఈయన అనారోగ్య కారణాలవల్ల కొద్దిరోజులు  ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది.. అయితే ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఆయన నిన్నటి రోజున డిశ్చార్జ్ అయ్యి మరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన తాడిపత్రి ప్రజలతో మాట్లాడడం జరిగింది.


తాడిపత్రి నియోజకవర్గం ప్రజలు, ఆశీర్వాదం ఆ దేవుని దయ వల్లే తాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డానని.. ఎందుకంటే ఇటీవలే తన పరిస్థితి చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని తెలియజేశారు. తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు ,అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవరు ఇక్కడికి రా వద్దని జెసి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఇప్పుడిప్పుడే తాను కాస్త కోరుకుంటున్నానని ఎవరితో కలిసే ఎందుకు మాట్లాడేందుకు ప్రస్తుతం తను సహకరించలేకపోతున్నానంటూ తెలియజేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. తన మీద మీకు ఉన్న ప్రేమ.. నాకు మీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు.


జెసి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే హైదరాబాదులో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. అయితే ఎందుకు చికిత్స తీసుకున్నారనే విషయం తెలియక అటు కార్యకర్తలు, నేతలు సైతం వాపోతున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా తన తండ్రిని చూసేందుకు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అండి అంటూ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తన ఆనారోగ్యపరిస్థితికి కారణాన్ని తెలియజేస్తారేమో చూడాలి మరి.. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో జెసి కుటుంబ హవా ఎక్కువగా నడుస్తోంది. ఏది ఏమైనా జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడిందని తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: