ఇలాంటి సమయంలో మొన్న విజయవాడలో మాత్రం సాధ్యం కావడం లేదు.. విజయవాడ స్టాండింగ్ కమిటీకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలలో వైసిపి పార్టీని కైవసం చేసుకుంది. అక్కడ కూటమి ప్రయత్నం ఫలించ లేదనే విధంగా తెలుస్తోంది. ఇప్పుడు అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా జరిగాయి.. ఐదుకు ఐదు కూడా వైసిపి పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూటమి ప్రభుత్వంలోకి చేర్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వానికి అందలేదని తెలుస్తోంది.
ఇటీవల 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని దీంతో వైసిపి పార్టీ ఇక ముందు కనిపించదనే విధంగా కూడా చాలా మంది కూటమి నేతలు ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలోనే అక్కడక్కడ వైసీపీ పార్టీ మళ్లీ పుంజుకునేలా కూడా కనిపిస్తూ ఉండడంతో అటు వైసీపీ కార్యకర్తలు నేతలకు సైతం ఇది మరింత ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తుంది. మరి 2029 ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ ఎలాంటి విహాత్మకంగా ప్రయత్నాలతో ముందుకు వెళుతుందో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అనే ట్యాగ్ తోనే సొంతంగా ఇమేజను సంపాదించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.